Oppenheimer Collections ఒప్పెన్‌హైమర్ కలెక్షన్ల కుంభవృష్టి.. క్రిస్టఫర్ నోలన్ మూవీకి ఎన్ని కోట్లంటే?
అణుబాంబు సృష్టికర్త డాక్టర్, సైంటిస్ట్ ఒప్సెన్‌హైమర్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ఒప్పెన్‌హైమర్. హిరోషిమా, నాగాసకి నగరాలపై అణుబాంబు దాడి తర్వాత జరిగిన పరిణామాలు, అమెరికా పొలిటిషియన్స్, సైంటిస్టుల మధ్య జరిగిన కోల్డ్ వార్ నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కింది. పొలిటికల్, సైంటిఫిక్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్రం జూలై 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి ఏమిటి? కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
ఒప్పెన్‌హైమర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో దర్శక, నిర్మాత క్రిస్టఫర్ నోలన్ రూపొందించారు. రాబర్ట్ డౌనీ జూనియర్, సిలియన్ మర్ఫి లాంటి అగ్ర నటులతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను దాదాపు 100 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో 820 కోట్ల రూపాయలతో నిర్మించారు.

క్రిస్టఫర్ నోలన్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉండటంతో ఒప్పెన్‌హైమర్ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ భారీగా నమోదైంది. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా లాంటి నగరాల్లో ఈ సినిమాకు భారీ స్పందన కనిపించింది. దాంతో ఈ సినిమాను ఇండియాలో దాదాపు 1200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.
ఒప్పెన్‌హైమర్ సినిమాకు తొలి రోజు భారీ స్పందన కనిపించింది. ఈ సినిమా ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ఇండియా వైడ్‌గా మార్నింగ్ షోకు 40 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి 50 శాతం, ఫస్ట్ షోకు 60 శాతం, సెకండ్ షోకు 70 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఐమాక్స్‌లో 2డీ వెర్షన్‌కు దాదాపు 80 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

ఒప్పెన్‌హైమర్ సినిమాకు భారీ కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమాకు మంచి స్పందన లభించడంతో కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ సినిమా తొలి రోజు 16 కోట్ల కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఈవెనింగ్ షోకు ఆక్యుపెన్సీ పెరిగితే కలెక్షన్లు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇక ఒప్పెన్‌హైమర్ అడ్వాన్స్ బుకింగ్ భారీగా ఉండటంతో తొలివారాంతం అంటే తొలి ఆదివారం ముగిసే సమయానికి ఈ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. అమెరికాలో 50 మిలియన్ డాలర్లు, ఇండియా, ఇతర దేశాల్లో కలిపి 60 మిలియన్ డాలర్లు రాబట్టే అవకాశం ఉంది. దాంతో తొలి వారాంతం 110 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











