Oppenheimer Vs Barbie దుమ్మురేపుతున్న హలీవుడ్ మూవీస్.. ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ కేక

ప్రముఖ నిర్మాత, దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన బయోగ్రాఫికల్ థ్రిల్లర్ ఓపెన్‌హీమెర్ (Oppenheimer). అణు యుగంలో మాన్ హట్టన్ ప్రాజెక్టుగా పేర్కొనే అణుబాంబు తయారీ చుట్టు అల్లుకొన్న కథలో సిలియన్ మర్ఫీ, రాబర్ట్ డౌనీ జూనియర్,లెస్లీ గ్లోవ్ లాంటి నటీనటులు అద్బుతంగా నటించారు. ఈ సినిమా ఇటీవల పలు దేశాల్లో ప్రీవ్యూ ప్రదర్శించారు. జూలై 21వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, షో, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఓపెన్‌హీమెర్ (Oppenheimer) చిత్రం ఈ దశాబ్దపు అత్యుత్తమ చిత్రంగా నిలిచే విధంగా టాక్ సొంతం చేసుకొన్నది. ఆటంబాబు తయారీకి సంబంధించిన విధ్వంసకమైన స్టోరీని అద్బుతంగా చెప్పారని పలు రివ్యూలు పేర్కొంటున్నాయి. సిలియన్ మర్ఫీ కెరీర్‌లోనే ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్. స్క్రీన్‌పై ఎమోషన్స్‌ను క్రిస్టఫర్ నోలన్ పండించిన తీరు అద్బుతం. అన్ని రకాల అవార్డులను గెలుచుకొనేందుకు ఈ సినిమా జైత్రయాత్రను మొదలుపెట్టింది అని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు.

Oppenheimer Vs Barbie: Huge Response advance booking in India

ఇండియాలో హాలీవుడ్ చిత్రాలు ఓపెన్‌హీమెర్, బార్బీ సినిమాలు పోటాపోటీగా బాక్సాఫీస్ వద్ద అమీతుమీ అంటూ తలపడుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ రెండు సినిమాలకు భారీ ఆదరణ లభిస్తున్నది. ఓపెన్‌హీమెర్ సినిమాను 255 షోలు ప్రదర్శిస్తుండగా, 50 శాతం అడ్వాన్స్ బుకింగ్ జరిగింది. ఓపెన్‌హీమీర్ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1 కోటి రూపాయలు వసూలు చేసింది. బార్సీ మూవీ విషయానకి వస్తే.. 127 షోలు ప్రదర్శిస్తుండగా 25 లక్షలు వసూలు అయింది.

ఇండియా వ్యాప్తంగా ఓపెన్‌హీమెర్ సినిమాతో బార్బీ భారీ పోటీ పడుతున్నది. ఇండియా వైడ్‌గా ఓపెన్‌హీమెర్ చిత్్రాన్ని 2550 షోలు ప్రదర్శిస్తున్నారు. 50 శాతం టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో అమ్ముడుపోయాయి. దాదాపు 10 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్‌ రూపంలోనే రాబట్టింది. ఇక బార్బీ విషయానికి వస్తే.. 2100 షోలు ఇండియాలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. 35 శాతం టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే అమ్ముడుపోయాయి. దాదాపు 4 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు అయ్యాయి.

ఓపెన్‌హీమెర్ చిత్రానికి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు భారీ స్పందనను కూడగట్టుకొంటున్నాయి. హైదరాబాద్‌లో 253 షోలు ప్రదర్శిస్తున్నారు. చెన్నైలో 130 షోలు, బెంగళూరులో 400 షోలు ప్రదర్శిస్తున్నారు. పలు నగరాల్లో భారీగా షోలను ఏర్పాటు చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X