ఆరెంజ్ చిత్రం మెదటి మూడు రోజుల కలెక్షన్స్ ఎంతంటే...
రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ మాత్రం దుమ్మురేతోందని తెలుస్తోంది. ఈ సంవత్సంరం బెస్ట్ ఓపినింగ్స్ లో ఆరెంజ్ ఒకటని చెప్తున్నారు. మొదటి రెండు రోజులు(శుక్రవారం, శనివారం) ఈ చిత్రం ఏడు కోట్ల రూపాయలు కలెక్షన్స్ సంపాదించిందని ట్రేడ్ రిపోర్టు. ఇక మూడో రోజు ఆదివారం..వీకెండ్ కావటంతో నాలుగు కోట్లు వరకూ అంతటా కలెక్టు చేసిందని, మొత్తం పదకొండు కోట్లు వరకూ ఈ మూడు రోజుల్లో రెవిన్యూ జనరేట్ చేసిందని చెప్తున్నారు. ఇక సోమవారం కూడా ఇదే రేంజిలో కలెక్షన్స్ కొనసాగితే కమర్షియల్ గా మంచి విజయమే సాధించినట్లు అవుతుందని చెప్తున్నారు. అయితే గడిచిన మూడు రోజులు కలెక్షన్స్...మగధీర వంటి మెగా హిట్ చిత్రం తర్వాత వచ్చిన చిత్రం కావటం, హీరో ఇమేజ్, మొదటి వారంలో చూడాలనుకునే అభిమానుల పొటిన్షియల్ ఉంటుందని, కాబట్టి ఇక నుంచి వచ్చే కలెక్షన్సే నిలకడగా సినిమా రేంజి చెప్పేవి అవుతాయని చెప్తున్నారు. మరో ప్రక్క హీరో రామ్ చరణ్ మాత్రం నాలుగైదు రోజులు ఈ చిత్రం జనాల్లోకి పోవటానికి పడుతుందని, ఆ తర్వాత విజయం సాధించటం తధ్యమని హామీ ఇస్తున్నాడు.


Click it and Unblock the Notifications











