Ram Charan's Orange collections రాంచరణ్ బాక్సాఫీస్ రచ్చ.. 2 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే.. జనసేనకు ఎంతంటే
మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన ఆరెంజ్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, అమెరికాలో స్పెషల్ షోలు ప్రదర్శించారు. రాంచరణ్ కెరీర్‌లో మగధీర తర్వాత మూడో చిత్రంగా వచ్చిన ఆరెంజ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే రాంచరణ్, జెనీలియా జంటగా నటించిన ఆరెంజ్ సినిమాను తాజాగా ప్రదర్శించగా.. భారీ క్రేజ్ లభించింది. ఈ సినిమా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

40 కోట్ల బడ్జెట్‌తో ఆరెంజ్
ఆరెంజ్ చిత్రం 2010లో 40 కోట్ల వ్యయంతో అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత నాగబాబు రూపొందించారు. ఈ సినిమా నిర్మాత నాగబాబుకు తీరని నష్టాలు తీసుకొచ్చి.. భారీగా అప్పుల్లో కూరుకుపోయేలా చేసింది. అప్పుల బాధను తట్టుకోలేక ఇల్లు, ఆస్తులు అమ్మినట్టు వార్తలు వచ్చాయి. ఓ దశలో నాగబాబు ఆత్మాహత్యకు సిద్దపడినట్టు సమాచారం. బాక్సాఫీస్ వద్ద అలాంటి ఫలితాన్ని ఈ సినిమా అందించిందని ట్రేడ్ వర్గాలు చెప్పుకొంటాయి.
రాంచరణ్ బర్త్ డే రోజున
రాంచరణ్ బర్త్ డే సందర్భంగా అభిమానులు, నిర్మాత నాగబాబు ఆరెంజ్ సినిమా స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నట్టు ప్రకటించారు. ఆరెంజ్ సినిమా ద్వారా వచ్చే కలెక్షన్లను జనసేన పార్టీ నిధికి విరాళంగా ఇస్తామని నిర్మాత నాగబాబు వెల్లడించారు. పార్టీ సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగిస్తామని పేర్కొన్నారు.
64 సిటీల్లో 223 షోలు
ఆరెంజ్ సినిమాను దాదాపు 64 ప్రాంతాల్లో భారీగా స్పెషల్ షోలు ప్రదర్శించారు. ఈ సినిమాను సుమారు 223 షోలు ప్రదర్శించారు. దాదాపు 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. సుమారు 31 షోలు హౌస్‌పుల్‌గా నిలిచాయి. వైజాగ్, హైదరాబాద్, బెంగళూరులో భారీ స్పందన కనిపించింది.

హైదరాబాద్‌లో రికార్డు కలెక్షన్లు
ఆరెంజ్ సినిమా హైదరాబాద్‌లో భారీ వసూళ్లను సాధించింది. హైదరాబాద్‌లోని క్రాస్ రోడ్డులో అభిమానులు పోటెత్తారు. ఎక్స్ రోడ్డులోనే ఈ సినిమా దాదాపు 30 లక్షల రూపాయలను వసూలు చేసింది. గతంలో ఫ్లాప్ సినిమాగా నిలిచిన ఈ సినిమా స్పెషల్ షోలకు బ్రహ్మండంగా ఆదరణ లభించడం చర్చనీయాంశమైంది. ఇటీవల ప్రదర్శించిన పవన్ కల్యాణ్ ఖుషీ, జల్సా కంటే ఎక్కువ వసూళ్లను ఈ సినిమా సాధించడం విశేషంగా మారింది.

రెండు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
ఆరెంజ్ సినిమాను శనివారం పరిమిత షోలు ప్రదర్శించగా, 15 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆదివారం ఈ సినిమాకు భారీ స్పందన లభించింది. మెగా ఫ్యాన్స్ పోటెత్తడంతో ఈ సినిమా ఆదివారం 1.3 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం రెండు రోజుల్లో 1.45 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

మూడో రోజు కూడా ఆగని రచ్చ
ఆరెంజ్ సినిమా మూడో రోజు కూడా అదే జోష్‌ను ప్రదర్శిస్తున్నది. ఈ చిత్రానికి హైదరాబాద్‌తోపాటు వైజాగ్‌లో అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. వైజాగ్‌లో సంగం, శ్రీ మెలోడి థియేటర్లలో కడపటి వార్తలు అందేసరికి సంగంలో 82 వేలకుపైగా, శ్రీ మెలోడిలో 61 వేల రూపాయలను వసూలు చేసింది. ప్రస్తుతం విడుదలైన సినిమాలను మించి కలెక్షన్లను సాధిస్తున్నది.


Click it and Unblock the Notifications











