Orange 4 days Re Release Collections: ఆరెంజ్ రీ రిలీజ్ కలెక్షన్లు.. కోట్లు కొల్లగొట్టిన రాంచరణ్ మూవీ

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, జెనీలియా డిసౌజా హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి ఆరెంజ్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్వకత్వం వహించారు. ఈ చిత్రంలో షాజాన్ పాదామ్‌సీ, ప్రభు, ముఖేష్ రిషి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, సమీర్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, కల్పిక గణేష్ తదితరులు నటించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నాగబాబు కొణిదెల నిర్మించారు.

ఇప్పటికీ అత్యంత పాపులర్ అయిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను ఈ సినిమా కోసం హ్యారీస్ జయరాజ్ అందించగా, సినిమాటోగ్రఫిని కిరణ్ రెడ్డి, బీ రాజశేఖర్, ఎడిటింగ్‌ను మార్తాండ్ కే వెంకటేష్ అందించారు. ఈ సినిమా 2010 సంవత్సరం నవంబర్ 26వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాను మళ్లీ ఫిబ్రవరి 7వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లోను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో ఆ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ భారీ స్పందన లభించింది. ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నదనే వివరాల్లోకి వెళితే..

orange Box Office

ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే.. కథ డిమాండ్ చేయడంతో దాదాపు ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలోనే షూట్ చేశారు. ఈ సినిమాలో దాదాపు 150 మందికి పైగా ఆస్ట్రేలియన్ క్రూ పనిచేశారు. ఆ తర్వాత మలేషియాలో కూడా కొంత భాగం చిత్రీకరించారు. దాంతో అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను సుమారుగా 30 నుంచి 35 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించారు.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫస్ట్ రిలీజ్ సమయంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పటికే రాంచరణ్ ఇమేజ్‌కు తగినట్టు మూవీ కంటెంట్ లేకపోవడంతో అభిమానులు,ప్రేక్షకులు తేల్చిపడేశారు. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది.నిర్మాత నాగబాబును పీకల్లోతు నష్టాల్లోకి నెట్టింది.

ఆరెంజ్ సినిమా రీ రిలీజ్‌ను సుమారుగా 6 రాష్ట్రాల్లో విడుదల చేశారు. దాదాపు 90 లోకేషన్లలో సుమారుగా 500 షోలు ప్రదర్శించారు. తొలి రోజు ఈ సినిమాకు
50 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. దాదాపు లక్షకుపైగా టికెట్లు అమ్ముడు పోయాయి. దాంతో మొదటి రోజు భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

రాంచరణ్ నటించిన ఈ చిత్రం ప్రీమియర్ల ద్వారా 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక తొలి రోజున 1.25 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.5 కోట్ల రూపాయలు, మూడో రోజున 75 లక్షల రూపాయలు, నాలుగో రోజున 25 లక్షల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా ప్రీమియర్లతో కలిపి మొత్తంగా 6.75 కోట్ల రూపాయలు రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: orange ram charan nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X