Orange Re release Collections: ఆరెంజ్ రీ రిలీజ్‌కు క్రేజీ ఓపెనింగ్స్.. బాక్సాఫీస్ వద్ద రాంచరణ్ మూవీ హంగామా!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా, జెనీలియా డిసౌజా హీరోయిన్‌గా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరి ఆరెంజ్. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్వకత్వం వహించారు. ఈ చిత్రంలో షాజాన్ పాదామ్‌సీ, ప్రభు, ముఖేష్ రిషి, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, సమీర్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, కల్పిక గణేష్ తదితరులు నటించారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నాగబాబు కొణిదెల నిర్మించారు.

ఇప్పటికీ అత్యంత పాపులర్ అయిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ను ఈ సినిమా కోసం హ్యారీస్ జయరాజ్ అందించగా, సినిమాటోగ్రఫిని కిరణ్ రెడ్డి, బీ రాజశేఖర్, ఎడిటింగ్‌ను మార్తాండ్ కే వెంకటేష్ అందించారు. ఈ సినిమా 2010 సంవత్సరం నవంబర్ 26వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమాను మరోసారి రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మళ్లీ ఫిబ్రవరి 7వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోను, ఓవర్సీస్‌లోను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమా ప్రీ బుకింగ్ భారీగా స్పందన లభిస్తున్నది. ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తున్నదనే వివరాల్లోకి వెళితే..

Orange Re release Box Office Collections

ఈ సినిమా కథ డిమాండ్ చేయడంతో దాదాపు ఎక్కువ భాగం ఆస్ట్రేలియాలోనే షూట్ చేశారు. ఈ సినిమాలో దాదాపు 150 మందికి పైగా ఆస్ట్రేలియన్ క్రూ పనిచేశారు. ఆ తర్వాత మలేషియాలో కూడా కొంత భాగం చిత్రీకరించారు. దాంతో అప్పట్లో భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను సుమారుగా 30 నుంచి 35 కోట్ల రూపాయల వ్యయంతో చిత్రీకరించారు.

ఈ చిత్రాన్ని గతంలో అంటే రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మార్చి 25, 2023 సంవత్సరంలో రిలీజ్ చేయగా, మంచి రెస్పాన్స్ లభించింది. ఈ జనరేషన్ ఆడియెన్స్ థియేటర్లకు పొటేత్తారు. దాంతో ఈ సినిమా సుమారుగా 4 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ప్రస్తుతం ప్రేమికుల రోజు సందర్భంగా ఆరెంజ్ సినిమాను మరోసారి రిలీజ్ చేయాలని ప్లాన్ సిద్దం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీ 4k, డాల్బీ సౌండ్, ఇతర సాంకేతిక అంశాలతో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇటీవల ప్రారంభించగా మంచి స్పందన కనిపిస్తున్నది.

రాంచరణ్ నటించిన ఈ కల్ట్ క్లాసిక్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి 15 వేల టికెట్లు బుక్ మై షో, ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్స్‌లో అమ్ముడుపోయాయి. తద్వారా 25 లక్షల రూపాయల కలెక్షన్లు రాబట్టింది. ఇంకా 5 రోజుల సమయం ఉంది కాబట్టి.. ఈ వసూళ్ల రేంజ్ పెరిగే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

More from Filmibeat

Read more about: orange ram charan nagababu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X