Organic Mama Hybrid Alludu day 1 Collections.. షాకింగ్‌గా బాక్సాఫీస్ రిపోర్ట్.. తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?
తెలుగు సూపర్‌హిట్ దర్శకుడు ఎస్‌వి కృష్ణా రెడ్డి 9 ఏళ్ల విరామం తర్వాత ఆర్గానిక్ మామా హైబ్రిడ్ అల్లుడు సినిమాతో మరోమారు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బిగ్‌బాస్ సోహైల్, మృణాళిని రవి హీరోహీరోయిన్లుగా రాజేంద్ర ప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

90వ దశకంలో హవా కొనసాగించి..
90 దశకంలో ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలు ప్రేక్షకులను కొత్త అనుభూతిని కలిగించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పడించాయి. అయితే కొత్త జనరేషన్‌కు తగినట్టుగా తన సినిమాలను రూపొందించడంలో ఆయన కొద్ది సంవత్సరాలుగా తడబాటుకు గురవుతున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న బిగ్ బాస్ సోహెల్‌తో తాజాగా ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు సినిమాతో ప్రేక్షకుల మందుకు వచ్చారు.

మిక్స్‌డ్ టాక్‌తో ఆర్గానిక్ మామ
టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు చిత్రం మిక్స్‌డ్ టాక్‌ను సంపాదించుకొన్నది. తొలి ఆట తర్వాత పెద్దగా ప్రేక్షకులు ఆకట్టుకొన్న దాఖలాలు కనిపించలేదు. అడ్వాన్స్ బుకింగ్‌కు పెద్దగా రెస్పాన్స్ లేదు. దాంతో ఈ సినిమా యావరేజ్ చిత్రంగా నిలిచిందనే టాక్ ట్రేడ్ వర్గాల నుంచి వినిపించింది.

తొలి రోజు ఆక్యుపెన్సీ
ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. మార్నింగ్ షోకు 22 శాతం, మ్యాట్నీకి 20 శాతం, ఫస్ట్ షోకు 23 శాతం, సెకండ్ షోకు 16 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఈ సినిమాకు బలగం మూవీ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దాంతో ఈ సినిమా కలెక్షన్ల రేసులో వెనుకబడింది.

తొలి రోజు కలెక్షన్ల అంచనా
ఇక ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు కలెక్షన్ల విషయానికి వస్తే.. చాలా పేలవంగానే నమోదు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు 30 నుంచి 50 లక్షల వసూళ్లను రాబట్టవచ్చని అంచనా వేశారు. యూఎస్‌లో ప్రీమియర్లు లేకపోవడంతో ఈ సినిమా తెలుగు, కర్ణాటక రాష్ట్రాలకే పరిమితమైంది.

బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. ఎలాంటి డేటా అందుబాటులో లేదు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎంత అనేది కూడా క్లారిటీ లేదు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ సినిమా హిట్టా? ఫట్టా అనేది తేలిపోవడం ఖాయం.


Click it and Unblock the Notifications











