Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Ori Devuda Day 1 Collections విశ్వక్ సేన్ రేంజ్‌కు మించి.. ఫస్ట్ డే కలెక్షన్లు ఎంతంటే?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా ప్రముఖ నిర్మాత పీవీపీ నిర్మించిన చిత్రం ఓరి దేవుడా చిత్రం అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిథిలా పాల్కర్, ఆశా భట్ నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ బజ్‌తో బాక్సాఫీస్ జర్నీ మొదలుపెట్టింది. సినీ ప్రేక్షకులు, విమర్శకుల సానుకూల స్పందనతో తొలి రోజు థియేటర్లలో ఆక్యుపెన్సీ కూడా భారీగానే కనిపించింది. ఇలాంటి టాక్ మధ్య తొలి రోజు ఏ మేరకు కలెక్షన్లను సాధించిందంటే?
ఓరి దేవుడా ప్రీ రిలీజ్ బిజినెస్
తమిళ చిత్రానికి రీమేక్‌గా ఓరి దేవుడా చిత్రం సుమారు 10 కోట్ల వ్యయంతో రూపొందింది. ఈ సినిమాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 6 కోట్లుగా నమోదైంది. దాంతో ఈ సినిమా 6.5 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో వసూళ్ల పర్వాన్ని ప్రారంభించింది.
ఓరి దేవుడా స్క్రీన్ కౌంట్
తెలుగు రాష్ట్రాల్లో ఓరీ దేవుడా సినిమా స్క్రీన్ల విషయానికి వస్తే.. నైజాంలో 160 స్క్రీన్లు, సీడెడ్‌లో 80 స్క్రీన్లు, ఆంధ్రాలో 200 స్క్రీన్లతో కలిపి ఏపీ, నైజాంలో మొత్తం 440 స్క్రీన్లలో రిలీజైంది. ఏపీ, నైజాంలో ఓవరాల్‌గా ఈ చిత్రం 35 శాతం అక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది.
యూఎస్ఏలో కలెక్షన్లు
ఓరి దేవుడా చిత్రం యూఎస్ఏలో విశ్వక్ సేన్ రేంజ్‌కు మించి రిలీజైంది. ఈ చిత్రాన్ని 153 లోకేషన్లలో ప్రదర్శించారు. కడపటి సమాచారం ప్రకారం.. ఓరి దేవుడా చిత్రం సుమారు 29000 డాలర్లు రాబట్టింది. అంటే ఈ చిత్రం తొలి రోజున అమెరికాలో సుమారు 24 లక్షల రూపాయలు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
ఓరి దేవుడా చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 1.5 కోట్ల షేర్, అమెరికా, ఇతర ఓవర్సీస్లో 50 లక్షలు సాధించింది. దాంతో ఈ చిత్రం 2 కోట్ల మేర షేర్.. 4 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఓరి దేవుడా లాభాల్లోకి రావాలంటే?
ఓరి దేవుడా సినిమా ప్రపంచవ్యాప్తంగా లాభాల్లోకి రావాలంటే.. ఈ సినిమా 6.5 కోట్ల షేర్, 12 కోట్ల గ్రాస్ సాధించాల్సి ఉంది. ప్రస్తుతం అటు ఇటుగా 2 కోట్ల షేర్ సాధించింది. రానున్న రోజుల్లో ఈ చిత్రం ఇంకా 6 కోట్లకుపైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనే వేచి చూడాల్సిందే.