Ori Devuda Day 3 Collections విశ్వక్ సేన్‌ కెరీర్‌లో క్రేజీగా కలెక్షన్లు.. మూడో రోజు ఎంతంటే?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ నోట్‌తో దూసుకెళ్తున్నది. తమిళంలో విజయవంతమైన ఓ మై కడువలే చిత్రానికి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో నటించారు. ఇక మిథిలా పార్కర్, ఆషా భట్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత పీవీవీ తన బ్యానర్‌పై రూపొందించారు. ఈ సినిమా గత మూడు రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే?

బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఎంతంటే?

ఓరి దేవుడా చిత్రం రిలీజ్‌కు ముందు క్రేజీగా నిలవడంతో భారీ బిజినెస్‌ను నమోదు చేసింది. ఈ చిత్రాన్ని దాదాపు 10 కోట్ల వ్యయంతో రూపొందించారు. తెలుగులో ఈ సినిమా బిజినెస్ 6 కోట్లుగా జరిగినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 6.5 కోట్ల షేర్‌తో బ్రేక్ ఈవెన్ సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి లక్ష్యంతో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో వసూళ్లను రాబడుతున్నది.

మూడో రోజు స్క్రీన్ కౌంట్, ఆక్యుపెన్సీ

మూడో రోజు స్క్రీన్ కౌంట్, ఆక్యుపెన్సీ

ఓరీ దేవుడా సినిమా స్క్రీన్ల కౌంట్ విషయానికి వస్తే.. నైజాంలో 160 స్క్రీన్లు, సీడెడ్‌లో 80 స్క్రీన్లు, ఆంధ్రాలో 200 స్క్రీన్లతో కలిపి ఏపీ, నైజాంలో మొత్తం 440 స్క్రీన్లలో రిలీజైంది. ఏపీ, నైజాంలో ఓవరాల్‌గా ఈ చిత్రం 35 శాతం అక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. ఇక ఈ చిత్రం మూడో రోజున మోస్తారు ఆక్యుపెన్సీని నమోదు చేసింది. కాకినాడ, మహబూబ్ నగర్‌లో 40 శాతం ఆక్యుపెన్సీని ఓవరాల్‌గా ఈ సినిమా 25 శాతం ఆక్యుపెన్సీతో మోస్తారు వసూళ్లను సాధించింది.

3వ రోజు కలెక్షన్లు..

3వ రోజు కలెక్షన్లు..


తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ రిపోర్టు విషయానికి వస్తే.. తొలి రోజున ఓరి దేవుడా చిత్రం రూ.1.5 కోట్లు, రెండో రోజున 1.6 కోట్లు సాధించింది. ఇక మూడో రోజు సెలవు దినం నాడు ఇతర సినిమాల పోటీని తట్టుకొని నిలకడగానే వసూళ్లను రాబట్టింది. మూడో రోజున ఈ చిత్రం 1.50 కోట్లు రాబట్టంది.

ఓవర్సీస్‌లో వసూళ్లు..

ఓవర్సీస్‌లో వసూళ్లు..


ఓరి దేవుడా సినిమా ఓవర్సీస్‌లో భారీ స్పందన కనిపిస్తున్నది. యూకేలో 11 వేల పౌండ్లు, అమెరికాలో 141k వసూళ్లను సాధించింది. వారాంతంలో కూడా సెలవు రోజులు కావడంతో ఈ సినిమాకు మరింతగా కలెక్షన్లను రాబట్టడానికి స్కోప్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఓరి దేవుడా ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?

ఓరి దేవుడా ప్రపంచవ్యాప్తంగా ఎంతంటే?


ఓరి దేవుడా చిత్రం గత మూడు రోజుల్లో నైజాంలో కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో 7 లక్షలు, ఓవర్సీస్‌లో 48 లక్షలు రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.8 కోట్ల షేర్, 7 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇంకా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. ఇంకా 1.2 కోట్లు వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X