For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాక్: తెలుగు డబ్బింగ్ రైట్స్ కు 20 కోట్లు

  By Srikanya
  |

  హైదరాబాద్ : సినిమా హిట్టైన తర్వాత ఆ హిట్ రేంజిని బట్టి డబ్బింగ్ రైట్స్ రేటు ఉంటుంది. అయితే అది రజనీకాంత్, సూర్య వంటి స్టార్స్ కు మినహాయింపు. అలాగే శంకర్ వంటి దర్శకులకు సైతం ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఆయన చిత్రం వస్తోందంటే అభిమానుల్లో ఉంటే ఆసక్తే వేరు. అందుకే ఆయన చిత్రాల డబ్బింగ్ రైట్స్ సైతం ఓ రేంజిలో పలుకుతాయి. శంకర్ తాజా చిత్రం 'మనోహరుడు' (తమిళంలో ఈ సినిమా పేరు ఐ) రైట్స్ ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి.

  ఈ చిత్రం రైట్స్ 20 కోట్లు చెప్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. లక్ష్మి గణపతి ఫిలింస్ వారు 15 కోట్లు వరకూ చెల్లించటానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇంకా డీల్ ఫైనల్ కాలేదని చెప్పుకుంటున్నారు. గతంలో రోబో చిత్రానికి 27cr కోట్లు ఎపి,తెలంగాణ థియోటర్ రైట్స్ నిమిత్తం చెల్లించారు. అయితే అక్కడ రజనీకాంత్ ఉండటం వల్ల ఆ రేటు పలికింది. ఇప్పుడు ఈ డీల్ ఎంతవరకూ వెళ్లి ఆగుతుందో చూడాలి.

  చిత్రం విశేషాలు కు వస్తే...

  నేపధ్యం

  నేపధ్యం

  చైనా నేపథ్యంలో జరిగే కథ ఇది. సినిమా ప్రారంభం, ముగింపు చైనాలోనే ఉంటుంది. అందుకే ఎక్కువ రోజులు అక్కడే షూటింగ్‌ చేశాం. సినిమాలో కొన్ని సీన్లు చూసిన చైనీయులు అవి చైనాలో ఎక్కడ తీశారో తెలుసుకోలేక ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

  రిలీజ్ సైతం...

  రిలీజ్ సైతం...

  చైనాలో 15 వేల థియేటర్లలో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. అక్కడ విడుదలయ్యే తొలి భారతీయ దక్షిణాది చిత్రం ఇదే. చైనాలో 30 వేల థియేటర్లు ఉంటే అందులో సగం థియేటర్లలో మా సినిమా విడుదల కావడం మాకు గర్వకారణం.

  హై చెక్నికల్ వ్యాల్యూస్

  హై చెక్నికల్ వ్యాల్యూస్

  శంకర్‌, ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్‌, ఏ.ఆర్‌. రెహమాన్‌, యాక్షన్‌ డైరెక్టర్‌ అణల్‌ అరసు వంటి టాప్‌ టెక్నీషియన్స్‌తో, విదేశీ సాంకేతిక నిపుణులతో హై టెక్నికల్‌ వాల్యూస్‌తో విజువల్‌ వండర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది.

  అవన్నీ...

  అవన్నీ...

  ఈ సినిమాని కేవలం సాంఘిక చిత్రమనో, యాక్షన్‌ చిత్రమనో, ప్రేమకథా చిత్రమనో, థ్రిల్లర్‌ అనో నిర్వచించలేం. ఎందుకంటే అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.

  ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామే

  ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామే

  గతంలో శంకర్‌, విక్రమ్‌ కాంబినేషన్‌లో నిర్మించిన ‘అపరిచితుడు' కంటే వంద రెట్లు ఈ సినిమా బాగుంటుంది. ఎన్నో ప్రత్యేకతలతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమాతో మా దర్శకుడు శంకర్‌ ‘భారతీయ జేమ్స్‌ కామరూన్‌'గా పేరు పొందుతారు. ఇకపై ప్రేక్షకులు ‘మనోహరుడు'కి ముందు, ఆ తరువాత అని గర్వంగా చెప్పుకుంటారు. ఈ సినిమా ఇంత గొప్పగా, రిచ్‌గా రావడానికి కారణం ఆ ఏడుకొండల వెంకటేశ్వరస్వామే. ఈ భారీ చిత్రానికి నిర్మాతని నేను కాదు ఆయనే అన్నారు నిర్మాత.

  ఫ్రిజ్ లో పెట్టారు

  ఫ్రిజ్ లో పెట్టారు

  ఈ సినిమాలో మా హీరో విక్రమ్‌ ఒక స్పెషల్‌ గెటప్‌లో కనిపిస్తారు. ఆ గెటప్‌ మేకప్‌ కోసం రోజూ 12 గంటలు పట్టేది. ‘ది లార్డ్స్‌ ఆఫ్‌ రింగ్స్‌', ‘ది హాబిట్‌' వంటి హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన ‘వేటా వర్క్‌ షాప్‌' మేకప్‌ టీమ్‌ మా సినిమా కోసం పనిచేసింది. మేకప్‌ కోసం ఒకరకమైన యాసిడ్‌ వాడారు. దాని వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండాలంటే ఎక్కువ సేపు ఏ.సి.లో ఉండాలి. అందుకే సెట్‌లో పది అడుగుల ఎత్తున ఫ్రిజ్‌లాంటిది తయారు చేస్తే, అందులో ఉండేవారు విక్రమ్‌.

  బరువు పెరిగారు

  బరువు పెరిగారు

  ఈ గెటప్‌ కోసం 115 కిలోల బరువు పెరిగారు విక్రమ్‌. ఆ తరువాత ఆరు నెలలకు పాత్ర కోసం మళ్లీ 55 కిలోలకు ఆయన తన బరువు తగ్గించుకోవడం విశేషం. ఈ సినిమా కోసం 25 నెలలు ఎంతో కష్టపడ్డారు విక్రమ్‌. అందుకే అవార్డులన్నీ ఆయన కోసం ఎదురుచూస్తున్నాయి.

  రహమాన్ పాడారు

  రహమాన్ పాడారు

  ఒక విచిత్రమైన గెటప్‌లో కనిపించే హీరో విక్రమ్‌, హీరోయిన్‌ ఎమీ జాక్సన్‌పై ఒక పాట తీశారు. మూడెకరాల స్థలంలో భారీ సెట్‌ వేసి, 40 రోజుల పాటు ఆ పాట చిత్రీకరించారు. ఈ పాటని ఏ.ఆర్‌.రెహమాన్‌ పాడటం విశేషం.

  సైకిల్ ఫైట్

  సైకిల్ ఫైట్

  చైనాలో ఒక సైకిల్‌ ఫైట్‌ తీశారు. దాదాపు 40 రోజుల పాటు ఈ ఫైట్‌ని ఎంతో థ్రిల్లింగ్‌గా తీశారు ఫైట్‌ మాస్టర్‌ అణల్‌ అరసు.

  ఇండియాలో రిలీజ్

  ఇండియాలో రిలీజ్

  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తున్నాం. అన్ని భాషల్లో కలిపి దాదాపు 5 వేల థియేటర్లలో చిత్రం విడుదలవుతోంది. అలాగే తైవాన్‌ భాషలోకి అనువదించి అక్కడ కూడా విడుదల చేస్తున్నాం.

  ఆడియో వేడుక

  ఆడియో వేడుక

  సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. ప్రస్తుతం రీరికార్డింగ్‌ జరుగుతోంది. సెప్టెంబర్‌ 15న ఆడియో వేడుక జరుగుతుంది. చెన్నైలో ఈ వేడుక నిర్వహించాలనుకొంటున్నారు. ఇక్కడ కుదరక పోతే హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో చేస్తారు.

  ఆడియోకు గెస్ట్ లుగా..

  ఆడియోకు గెస్ట్ లుగా..

  నాకు జాకీ చాన్‌తో, ఆర్నాల్డ్‌ ష్వార్జ్‌నెగర్‌తో 20 ఏళ్ల నుంచి స్నేహం ఉంది. ఇది యాక్షన్‌ చిత్రం కనుక వీళ్లలో ఒకరిని ఆడియో వేడుకకి ఆహ్వానించాలనుకుంటున్నాను అన్నారు నిర్మాత.

  English summary
  
 Aascar Ravi, Producer of Shankar's next 'Ai' & 'Manoharudu' is finding a Buyer for Telugu who is ready to shell out big bucks. He is quoting a Big Price of 20Cr for the Telugu Dub rights. 
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X