twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఓవర్ సీస్ లో దుమ్మురేపిన మన సినిమాలు-కలెక్షన్స్ లిస్ట్,టాప్ ఏది?

    By Srikanya
    |

    హైదరాబాద్ : గ్లోబులైజేషన్ నేపధ్యంలో మన సినిమా పరాయి దేశాల్లోనూ, పరాయి సినిమాలు మన దేశాల్లోనూ కలెక్షన్స్ వసూలు చేస్తూ రికార్డ్ లు క్రియేట్ చేస్తున్నాయి. దాంతో సినిమా బడ్జెట్ వేసుకునేటప్పుడే అక్కడి మార్కెట్ ని సైతం దృష్టిలో పెట్టుకుని తెరకెక్కిస్తున్నారు.

    అంతేకాదు సినిమా రిలీజవ్వగానే ఓవర్ సీస్ కలెక్షన్స్ ఎంత అనే టాపిక్ మొదలవుతోంది ట్రేడ్ వర్గాల్లో. తాజాగా ఈ టాపిక్ మరోసారి కబాలితో చర్చకు వచ్చింది. మొన్న శుక్రవారం రిలీజైన 'కబాలి' అనుకున్నట్లుగానే బాక్సాఫీసు వద్ద వీరవిహారం చేస్తోంది.

    రజనీకాంత్‌ హీరోగా నటించిన ఈ చిత్రం అంచనాలను మించి కలెక్షన్లు కురిపిస్తోంది. ఈ నెల 22న విడుదలైన 'కబాలి' తొలి నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.230 కోట్లు వసూలు చేసింది. ట్విస్ట్ ఏమిటీ అంటే మన దేశ వసూళ్లకు దీటుగా ఓవర్సీస్‌లోనూ దూసుకుపోతోంది 'కబాలి'.

    'కబాలి' ఒక్కటే కాదు ఇటీవలి కాలంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో మన దేశ చిత్రాలు ఓవర్సీస్‌లో సత్తా చాటుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ సాధ్యం కాని రీతిలో మన చిత్రాలు అక్కడ వసూళ్లు దండుకుంటున్నాయి. ఓవర్సీస్‌లో మన భారతీయ చిత్రాల హవా ఎలాంటిదో చూద్దాం. ఏ చిత్రానికి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం.

    ఒకప్పుడు మనదేశంలో రూ.100 కోట్ల వసూళ్లన్నది బాలీవుడ్‌కు భారీ మార్కెట్‌ ఉన్నా కష్టంగానే ఉండేది. ఇటీవలి కాలంలో ఈ పరిస్థితి మారింది. స్టార్ హీరోల చిత్రాలు స్వదేశంలో ఫస్ట్ వీకెండ్ లోనే రూ.100 కోట్లు సునాయాసంగా సాధించేస్తున్నాయి.

    మన సినిమాలు- ఓవర్ సీస్ కలెక్షన్స్

    కబాలి

    కబాలి

    విదేశాల్లో ఫస్ట్ వీకెండ్ లోనే లోనే రూ.87 కోట్లు వసూలు చేసింది. దీంతో విదేశాల్లో అత్యధిక ఫస్ట్ వీకెండ్ ...వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.

    స్దానిక భాషల్లోనే..

    స్దానిక భాషల్లోనే..

    ‘కబాలి'ని తెలుగు, తమిళ, హిందీలతో పాటు మలేసియా, థాయ్‌లాండ్‌ లాంటి దేశాల్లో స్థానిక భాషల్లోనే విడుదల చేశారు.

    ఆరు వేలకు పైగా...

    ఆరు వేలకు పైగా...

    అమెరికా, సింగపూర్‌, అరబ్‌ తదితర దేశాలు సహా ప్రపంచవ్యాప్తంగా ఆరు వేలకు పైగా థియేటర్లలో ‘కబాలి' సందడి చేసింది. దీంతో ప్రారంభ వసూళ్లు భారీ స్థాయిలో దక్కాయి.

    ధూమ్ 3

    ధూమ్ 3

    ఇంతకు ముందు ఓవర్సీస్‌లో తొలి వారాంతపు వసూళ్లలో ముందున్న ‘ధూమ్‌ 3' (రూ.70 కోట్లు)ని అధిగమించి రూ.100 కోట్లకు చేరువవుతోంది ‘కబాలి'.

    పీకే

    పీకే

    విదేశీ వసూళ్లలో అగ్రస్థానం ‘పీకే' చిత్రానిదే. ఆమీర్‌ ఖాన్‌ హీరోగా నటించిన ఈ చిత్రం మనదేశంతో పాటు పాకిస్తాన్‌, అమెరికా, చైనా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో భారీ స్థాయిలో విడుదలైంది. విదేశాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా ఇప్పటికీ ఘనత చాటుతోంది.

    చైనాలోనే రికార్డ్

    చైనాలోనే రికార్డ్

    ఇండియాలో రూ.489 కోట్లు సాధించిన ‘పీకే' విదేశాల్లో రూ.303 కోట్లు వసూలు చేయడం విశేషం. ఒక్క చైనాలోనే రూ.100 కోట్లు సాధించి ఆశ్చర్యపరిచింది.

    ‘బజరంగీ భాయిజాన్‌'

    ‘బజరంగీ భాయిజాన్‌'

    సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘బజరంగీ భాయిజాన్‌' ప్రపంచవ్యాప్తంగా విజయ ఢంకా మోగించింది. మనదేశంలో రూ.432 కోట్లు సాధించిన ‘బజరంగీ..' విదేశాల్లో రూ.193 కోట్లు దక్కించుకుంది.

    పాకిస్దాన్

    పాకిస్దాన్


    పాకిస్తాన్‌లో తొలివారానికే ‘బజరంగీ భాయిజాన్‌' రూ.38 కోట్లు వసూలు చేసింది.

    సుల్తాన్

    సుల్తాన్

    ఈమధ్య విడుదలైన ‘సుల్తాన్‌'తోనూ సల్మాన్‌ జైత్రయాత్ర కొనసాగుతూనే ఉంది. ఈ నెల 6న విడుదలైన ఈ చిత్రం గత చిత్రాల రికార్డులను బద్దలుకొట్టుకుంటూ ముందుకు సాగుతోంది. తొలి 20 రోజుల్లోనే ఇండియాలో రూ.406 కోట్లు, విదేశాల్లో రూ.152 కోట్లు వసూళ్లతో సత్తా చాటింది.

    బాహుబలి ప్రభంజనం

    బాహుబలి ప్రభంజనం

    తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రం ‘బాహుబలి: ది బిగినింగ్‌'. ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లతో ఆశ్చర్యపరిచింది. హిందీయేతర చిత్రాల్లో ఈ స్థాయిలో వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రమిదే కావడం గమనార్హం.

    వందకు మించి

    వందకు మించి

    ఆమీర్‌ ‘ధూమ్‌ 3', ‘త్రీ ఇడియట్స్‌', షారుఖ్‌ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌', ‘దిల్‌ వాలే', రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె నటించిన ‘బాజీరావ్‌ మస్తానీ' ఓవర్సీస్‌లో రూ.100 కోట్లకు మించి వసూళ్లు సాధించాయి.

    ‘ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో'

    ‘ప్రేమ్‌రతన్‌ ధన్‌పాయో'

    సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ప్రేమ్ రతన్ ధన్ పాయో చిత్రం ఓవర్ సీస్ లో రూ.93 కోట్లు కలెక్ట్ చేసి దుమ్మురేపింది

    ‘హ్యాపీ న్యూ ఇయర్‌'

    ‘హ్యాపీ న్యూ ఇయర్‌'

    షారూఖ్ ఖాన్ తన చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్‌' ద్వారా...రూ.90 కోట్లు సంపాదించింది

    ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌'

    ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌'

    హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ కాంబినేషన్ లో వచ్చిన ‘బ్యాంగ్‌ బ్యాంగ్‌' రూ.79 కోట్లు కోట్లు సంపాదించింది.

    ‘కిక్‌'

    ‘కిక్‌'

    రవితేజ హీరోగా వచ్చిన కిక్ రీమేక్ ...సల్మాన్ ఖాన్ తో అదే టైటిల్ తో చేసారు. ఈ చిత్రం (రూ.67 కోట్లు) ఓవర్సీస్‌ వసూళ్లతో సత్తా చాటాయి.

    English summary
    The Rajinikanth - Radhika Apte starrer Kabali that opened to rather mixed reviews from the critics. However, the film has managed to record good collections at the domestic and international box office. In this box office report we take a look at the overseas box office collections of Kabali breaking the same into day wise collections. Interestingly despite reports coming in from just two territories, the box office response to the film has been phenomenal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X