Paagal Day 1 collections.. విశ్వక్ సేన్ మూవీ కలెక్షన్లు ఏ రేంజ్‌లో అంటే!

టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద భారీ సందడి మొదలైంది. యువ హీరోల చిత్రాలు, మంచి కంటెంట్ చిత్రాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే కాకుండా మెప్పిస్తున్నాయి. సెకండ్ వేవ్ కరోనా వైరస్ తర్వాత చిన్న బడ్జెట్ చిత్రాలు భారీ విజయాన్ని సాధిస్తున్నాయి. ఊహించని వసూళ్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన చిత్రం పాగల్. ఇప్పటికే రెండు హిట్లతో జోష్ మీద ఉన్న విశ్వక్ సేన్, వరుస విజయాలను అందిస్తున్న నిర్మాత బెక్కెం వేణుగోపాల్ కాంబినేషన్‌లో తొలి చిత్ర దర్శకుడు నరేష్ కుప్పిలి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు పాగల్ చిత్రంతో ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, తొలి రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే...

విశ్వక్ సేన్‌ కెరీర్‌లో హయ్యెస్ట్ బిజినెస్

విశ్వక్ సేన్‌ కెరీర్‌లో హయ్యెస్ట్ బిజినెస్

ఫలక్‌నుమా దాస్, హిట్ చిత్రాల విజయంతో విశ్వక్ సేన్ సినిమా విజయాలతో ట్రేడ్ సర్కిల్స్‌లో మంచి క్రేజ్‌ను సొంతం చేసుకోవడంతో పాగల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగినట్టే ఈ సినిమా పట్ల రిలీజ్‌కు ముందు పాగల్‌పై ఆసక్తిని అటు ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు పెంచుకొన్నారు. ఈ క్రమంలో విశ్వక్ సేన్ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది.

తెలంగాణ, ఆంధ్రా, సీడెడ్‌లో ప్రీ రిలీజ్

తెలంగాణ, ఆంధ్రా, సీడెడ్‌లో ప్రీ రిలీజ్

ప్రేమ కథా చిత్రంగా రూపొందిన పాగల్ చిత్రంలో విశ్వక్ సేన్‌తోపాటు నివేదా పేతురాజ్, ఇంద్రజా శంకర్, మేఘా లేఖ, సిమ్రాన్ చౌదరీ నటించారు. క్రేజీ కాంబినేషన్ కారణంగా నైజాం, ఆంధ్రా, సీడెడ్‌లో భారీ బిజినెస్ జరిగింది. నైజాంలో ఈ చిత్రం రూ.2.50 కోట్ల బిజినెస్ చేసింది. ఆంధ్రాలోని పలు జిల్లాల ప్రీ రిలీజ్ రైట్స్ రూ.2.10 కోట్లకు అమ్ముడుపోయింది. ఇక సీడెడ్‌లో రూ.1.20 కోట్ల మేర బిజినెస జరిగింది.

ఓవర్సీస్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్

ఓవర్సీస్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్

పాగల్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల మినహాయిస్తే.. రెస్ట్ ఆఫ్ ఇండియా రైట్స్ రూ.50 లక్షల బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ బిజినెస్ రూ.75 లక్షల మేర జరిగినట్టు తెలిసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బిజినెస్ రూ.6.50 కోట్లకుపైగానే జరిగింది.

ఓవరాల్ ప్రీ బిజినెస్ ఎంతంటే

ఓవరాల్ ప్రీ బిజినెస్ ఎంతంటే

ఇక పాగల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.6.50 కోట్ల మేర జరగడంతో సినిమా ముందు భారీ లక్ష్యమే నిలిచింది. అయితే ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.7 కోట్ల మేర లాభాలను రాబట్టాల్సి ఉంటుంది. దీంతో బాక్సాఫీస్ పోరులో పాగల్‌ చిత్రాన్ని విశ్వక్ సేన్‌ లాభాల్లోకి దాటిస్తారా లేదా అనే విషయాన్ని వేచి చూడాల్సింది.

తొలి రోజు వసూళ్ల అంచనా..

తొలి రోజు వసూళ్ల అంచనా..

పాగల్ రిలీజ్ తర్వాత ఇండస్ట్రీలో, ప్రేక్షకుల్లో, సినీ విమర్శకుల్లో డివైడ్ టాక్ నెలకొన్నది. అయితే సినిమాపై క్రేజ్ ఉండటంతో తొలి రోజు ఒపెనింగ్స్ భారీగానే ఉన్నాయనే టాక్ నెలకొన్నది. తాజా రిపోర్టుల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1 కోటి నుంచి 1.5 కోట్ల రూపాయల నికర వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తున్నది. ఈ వారాంతంలోగా ఇదే ఊపు కొనసాగితే.. త్వరలోనే లాభాల్లోకి చేరుకొనే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X