twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Paagal Day 2 collections..స్టడీగా విశ్వక్ సేన్ మూవీ.. లాభాల్లోకి రావాలంటే?

    |

    యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన పాగల్ చిత్రం మిశ్రమ స్పందనతో వారాంతంలో పాజిటివ్‌గా ముందుకెళ్తున్నది. తొలి రోజు డీసెంట్ వసూళ్లను నమోదు చేయడంతో సినిమాపై సానుకూలత పెరిగినట్టు కనిపిస్తున్నది. విశ్వక్ సేన్ కెరీర్‌లో ఉత్తమ కలెక్షన్లను ఈ సినిమా రాబట్టడం గమనార్హం. అయితే రెండో రోజు కలెక్షన్లు ఎంత మేరకు ఉన్నాయంటే..

    భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విశ్వక్ సేన్ మూవీ

    భారీ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో విశ్వక్ సేన్ మూవీ

    పాగల్ సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే విశ్వక్ సేన్ కెరీర్‌లో తొలిసారి మంచి బిజినెస్ జరిగింది. రిలీజ్‌కు ముందే ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద భారీ లక్ష్యాన్నే చేధించాల్సిన పరిస్థితి పాగల్ ముందు నిలిచింది.

    40 శాతం అక్యుపెన్సీతో

    40 శాతం అక్యుపెన్సీతో

    కరోనా సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలోకి వచ్చిన పాగల్ సినిమాకు యావరేజ్‌ అక్యుపెన్సీ కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లో సుమారు 40 శాతం మేరకు అక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోల విషయానికి వస్తే.. 25 శాతం, మ్యాట్నీకి 40 శాతం, ఫస్ట్ షోకు 44 శాతం, సెకండ్ షోలకు 43 శాతం అక్యుపెన్సీ నమోదైనట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    తొలి రోజుల డిసెంట్‌గా

    తొలి రోజుల డిసెంట్‌గా

    పాగల్ చిత్రం తొలి రోజు కలెక్షన్లు పాజిటివ్‌గానే నమోదయ్యాయి. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.1.5 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది. సీడెడ్‌లో 21 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 4 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.8 లక్షలు, గుంటూరులో రూ.10 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.4.3 లక్షలు, నెల్లూరులో రూ.3.1 లక్షలు వసూలు చేసింది. మొదటి రోజు తెలంగాణ, ఆంధ్రాలో కలిపి రూ.1.30 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది.

    రెండో రోజున అటు ఇటుగా వసూళ్లు

    రెండో రోజున అటు ఇటుగా వసూళ్లు

    పాగల్ చిత్రం రెండో రోజున కూడా డిసెంట్‌గానే ఒపెనింగ్స్ సాధించింది. రెండో రోజున ఈ చిత్రం రూ.2.50 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాంలో ఈ చిత్రం రూ.40 లక్షలు, సీడెడ్‌లో 15 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 3.5 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.6.5 లక్షలు, గుంటూరులో రూ.10 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.4 లక్షలు, నెల్లూరులో రూ.2.5 లక్షలు వసూలు చేసిందనే విషయాన్ని అనధికారికంగా ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

     లాభాల్లోకి చేరుకోవాలంటే..

    లాభాల్లోకి చేరుకోవాలంటే..

    ఇక పాగల్ చిత్రం రూ.6.75 కోట్ల లక్ష్యంతో బాక్సాఫీస్ పోరులోకి దిగింది. అయితే రెండు రోజుల్లో రూ.5 కోట్ల మేర గ్రాస్ వసూళ్లను, సుమారు 3 కోట్ల రూపాయలకుపైగా నికర వసూళ్లను రాబట్టినట్టు తెలిసింది. దీంతో ఈ సినిమా కొంతలో కొంత మెరుగైన వసూళ్లను నమోదు చేసుకొందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వారాంతం తర్వాత స్టడీగా కలెక్షన్లను సాధిస్తే లాభాల్లోకి చేరుకొనే అవకాశం ఉంది.

    English summary
    Young hero Vishwak Sen's Paagal hits the screen on August 14. Here is the Paagal movie colected Rs.2.5 crores gross on Day 2nd worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X