Paagal Day 3 collections..షాకింగ్‌గా విశ్వక్ సేన్ మూవీ కలెక్షన్లు.. లాభాల్లోకి రావాలంటే!

సెకండ్ వేవ్ లాక్‌డౌన్ తర్వాత యువ హీరోల సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పది రోజుల క్రితం SR కల్యాణమండపం మూవీ థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించిన తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా పాగల్. ఫలక్‌నుమా దాస్, హిట్ లాంటి హిట్ల తర్వాత విశ్వక్ సేన్ నటించిన మూవీ కావడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం థియేటర్లోకి వచ్చిన మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద ఘనంగా వసూళ్లును రాబడుతున్నది. అలాంటి పాగల్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, వసూళ్లు వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో

ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో

పాగల్ చిత్రాన్ని నూతన దర్శకుడు నరేష్ కుప్పిలి తెరకెక్కించారు. నివేతా పేతురాజ్ హీరోయిన్‌గా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ నిర్మించారు. ఈ చిత్రం నైజాంలో రూ. 4 కోట్లు, సీడెడ్‌లో రూ.1.5 కోట్లు, ఆంధ్రా ప్రాంతంలో రూ.3.2 కోట్ల ప్రీ రిలీజ్‌ను నమోదు చేసింది. అయితే లాక్‌డౌన్ తర్వాత పరిస్థితులు మారిపోవడంతో ప్రీ రిలీజ్ బిజినెస్‌ను తగ్గించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారనేది ట్రేడ్ వర్గాల టాక్.

తొలి రెండు రోజుల్లో

తొలి రెండు రోజుల్లో

పాగల్ చిత్రం తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.1.4 కోట్ల షేర్‌ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే రూ.1.3 కోట్లు వసూలు చేయడం విశేషంగా మారింది. ఇక రెండో రోజు పాగల్ చిత్రం రూ.1.25 కోట్లు రాబట్టింది. దాంతో రెండు రోజుల్లో రూ.2.5 కోట్ల షేర్‌ను నమోదు చేసింది.

వర్కింగ్ డే రోజున 60 శాతం డ్రాప్

వర్కింగ్ డే రోజున 60 శాతం డ్రాప్

ఇక మూడో రోజు వర్కింగ్ డే కావడంతో సాధారణంగా అన్ని సినిమాల కలెక్షన్లు డ్రాప్ అవ్వడం జరుగుతుంది. పాగల్ కూడా అలాంటి పరిస్థితినే బాక్సాఫీస్ వద్ద ఎదుర్కొన్నది. తొలి, రెండో రోజు కలెక్షన్లతో పోలిస్తే ఈ చిత్రం సుమారు 60 శాతానికి పైగా వసూళ్లు డ్రాప్ అయినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

మూడో రోజున ఎంత వసూలు చేసిందంటే..

మూడో రోజున ఎంత వసూలు చేసిందంటే..

ఇలాంటి పరిస్థితుల్లో పాగల్ చిత్రం మూడో రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.45 లక్షల షేర్, ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 47 లక్షల షేర్‌ను సొంతం చేసుకొన్నట్టు సమాచారం. దాంతో మూడు రోజుల కలెక్షన్లను కలిపితే మొత్తంగా ఈ చిత్రం రూ.3 కోట్ల షేర్ రాబట్టినట్టు అయింది.

లాభాల్లోకి రావాలంటే..

లాభాల్లోకి రావాలంటే..

అయితే పాగల్ ప్రీ రిలీజ్ బిజినెస్ బట్టి చూస్తే... ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.6.5 కోట్లు రాబట్టాల్సి ఉండేది. అయితే ఇప్పటికే ఈ చిత్రం మూడు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో ఇంకా దాదాపు ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లో ఇంకా సగం రాబట్టాల్సి ఉంటుంది అనే మాటను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనే విషయం కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X