Paanch Minar Closing Collection: పాంచ్ మినార్ క్లోజింగ్ కలెక్షన్స్.. రాజ్ తరుణ్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
వరుస పరాజయాలు, వ్యక్తిగత జీవితంలో వివాదాలతో సతమతం అవుతున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఒకప్పుడు వరుస హిట్స్‌తో చిన్న నిర్మాతలకు ఆశాకిరణంలా కనిపించిన ఈ కుర్రాడు తర్వాత దానిని కంటిన్యూ చేయలేకపోయాడు. ఆయన హిట్ కొట్టి చాలాకాలమే అవుతోంది. కింగ్ అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన నా సామి రంగా తర్వాత రాజ్ కిరణ్ నటించిన పురుషోత్తముడు, తిరగబడారా సామి, భలే ఉన్నాడే, చిరంజీవ సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. కెరీర్‌లో నిలబడాలంటే ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన దశలో రాజ్ కిరణ్ నటించిన చిత్రం పాంచ్ మినార్. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎంత? పాంచ్ మినార్ మూవీకి లాభమెంత? నష్టమెంత? ఈ వివరాల్లోకి వెళితే..
పాంచ్ మినార్ తారాగణం
కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై మాధవీ, ఎంఎస్ఎం రెడ్డిలు సంయుక్తంగా ఈ పాంచ్ మినార్ మూవీని నిర్మించారు. రామ్ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన రాశీ సింగ్ హీరోయిన్‌గా నటించారు. నితిన్ ప్రసన్న, అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, సుదర్శన్‌లు ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. శేఖర్ చంద్ర సంగీత దర్శకత్వం వహించారు.

పాంచ్ మినార్ బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఈ సినిమాకు 3 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లోకేషన్స్‌లో పాంచ్ మినార్ షూటింగ్ జరుపుకుంది. రాజ్ తరుణ్ గత చిత్రాలు, టీజర్, ట్రైలర్లు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ పాంచ్ మినార్ మూవీపై ఇండస్ట్రీలో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాలని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.
పాంచ్ మినార్ కలెక్షన్స్ ఎంత?
తొలి రోజు నుంచే పాంచ్ మినార్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీనికి తోడు థియేటర్‌లలో భారీ పోటీ ఉండటంతో రాజ్ తరుణ్ సినిమా నిలబడలేకపోయింది. ఈ మూవీకి తొలి రోజున 31 లక్షల రూపాయలు, రెండో రోజున 7 లక్షల రూపాయలు, మూడో రోజున 23 లక్షల రూపాయలు, నాలుగో రోజున 21 లక్షల రూపాయలు, ఐదో రోజున 19 లక్షల రూపాయలు, ఆరో రోజున లక్ష రూపాయలు, ఏడో రోజున 11 లక్షల రూపాయలు మాత్రమే రాబట్టింది. దాంతో పాంచ్ మినార్ చిత్రం ఇండియాలో 1.13 కోట్ల రూపాయల నెట్, 1.26 కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది.
పాంచ్ మినార్‌కు లాభమెంత? నష్టమెంత?
విడుదలైన రోజు నుంచి ఎక్కడా కోలుకోలేకపోయిన పాంచ్ మినార్ మూవీ కేవలం 7 రోజులకే తన థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసింది. 7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉండగా.. కేవలం 1.26 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టి.. దాదాపు 4 కోట్ల రూపాయల మేర నష్టాల్ని తీసుకొచ్చిందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, డబ్బింగ్ రైట్స్, ఆడియో హక్కుల ద్వారా నిర్మాత స్వల్ప నష్టాలతో బయటపడినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. థియేటర్లలోకి వచ్చిన కేవలం వారం రోజుల్లోపే పాంచ్ మినార్ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నవంబర్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పాంచ్ మినార్ చిత్రం అందుబాటులోకి వచ్చింది.


Click it and Unblock the Notifications











