USAలో ఆశ్చర్యపరిచేలా ‘పాండవులు..’ కలెక్షన్స్

By Bojja Kumar

హైదరాబాద్: మంచు ఫ్యామిలీ మల్టీస్టారర్ మూవీ 'పాండవులు పాండవులు తుమ్మెద' యూఎస్ఏలో అందరూ ఆశ్చర్య పడేలా అంచనాలకు మించి వసూలు చేస్తోంది. ఇంతకు ముంచు విష్ణు నటించిన 'దూసుకెళ్తా' మూవీ యూఎస్ఏలో ఫుల్‌రన్‌లోరూ.31,76,625 ($50,826) వసూలు చేయగా, 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 39,08,125 ($62,530) వసూలు చేసింది.

సినిమా విడుదలైన రోజే పాజిటివ్ టాక్ రావడంతో పాటు, రివ్యూలు కూడా ఈ సినిమాకు అనుకూలంగా వచ్చాయి. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ కావడంతో సినిమాకు ఆదరణ పెరుగుతోంది. 'పాండవులు పాండవులు తుమ్మెద' సినిమా ఫ్యామిలీ ప్యాకేజ్ అంటున్నారు సరదాగా. కానీ అక్క లేకపోవడం చిన్న మిస్సింగ్. అయితే అక్క లక్ష్మిపై ఓ పాటని రఫ్‌గా షూట్‌ చేశాం. దాన్ని పూర్తిగా చిత్రీకరించి సినిమాలో కలిపే ఆలోచన ఉంది అంటున్నారు మంచు మనోజ్.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కిన ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహించారు.

ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X