Padayappa Closing Collections: తమిళనాడులో రజనీ కలెక్షన్ల ప్రభంజనం.. విజయ్ మూవీని కొట్టలేకపోయిన పడయప్పా!
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం పడయప్ప. 1999 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఆల్ టైమ్ ఫేవరేట్‌గా మిగిలిపోయింది. ఈ చిత్రంలో సౌందర్య, అబ్బాస్, సితార, నాజర్, రాధా రవి తదితరులు నటించారు. లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ కీలక పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి మ్యాజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా, ఎస్ మూర్తి, ప్రసాద్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వర్తించారు. కే తనిగాచలం ఎడిటింగ్ బాధ్యతలను పర్యవేక్షించారు. అరుణాచల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను కే సత్యనారాయణ, ఎంవీ కృష్ణారావు, కే విట్టల్ ప్రసాద్ రావు, పీఎల్ తేనప్పన్ నిర్మించారు.

యాక్షన్, రివేంజ్, లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం 1999 సంవత్సరంలో ఈ చిత్రం రిలీజై తమిళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించింది. రజనీకాంత్, రమ్యకృష్ణ పోటాపోటీగా నటించారు. నీలాంబరి పాత్రలో ఆమె తన నట విశ్వరూపాన్ని చూపించారు. రజనీకాంత్ తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో లవ్, ఎమోషనల్ డ్రామాగా మార్చారు. రజనీ తన కెరీర్ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు.
తమిళంలో పడయప్పా, తెలుగులో నరసింహగా రూపొందిన ఈ సినిమా రీ రిలీజ్‌కు తమిళనాడులో భారీ స్పందన లభించింది. కొత్తగా రిలీజైన సినిమాల కంటే అధికంగా కలెక్షన్లు సాధించింది. వారం రోజులపాటు థియేటర్లలో జాతర సాగింది. శివకార్తికేయన్, రమ్యకృష్ణ లాంటి యాక్లర్లు థియేటర్‌కు ఈ సినిమాను ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇక రజనీకాంత్ అభిమానులకు ఈ సినిమా పండుగ వాతావరణం తెచ్చిపెట్టింది.
గత వారం రోజుల్లో పడయప్పా చిత్రం బాక్సాఫీస్ కుదిపేసింది. తమిళనాడులో ఈ చిత్రం 11.5 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింద. కర్ణాటకలో కూడా రజనీ మ్యాజిక్ కొనసాగడంతో 1.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇండియాలో ఈ చిత్రం 13.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తమిళనాడులో రీ రిలీజ్ సినిమాల్లో రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.
ఇండియాలో 13.25 కోట్ల రూపాయలు వసూలు చేసిన రజనీ మూవీ.. ఓవర్సీస్‌లో మెరుగైన కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం నార్త్ అమెరికా, ఇతర దేశాల్లో 2.75 కోట్ల రూపాయలు వసూలుచేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 16 కోట్ల రూపాయలు గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని సాక్ నిక్, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
అయితే భారీ వసూళ్లు సాధించిన పడయప్పా మూవీ విజయ్ నటించిన గిల్లీ సినిమాను వసూళ్లను అధిగమించలేకపోయింది. తమిళనాడులో గిల్లీ చిత్రం 20 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. అలాగే విజయ్ నటించిన సచిన్ మూవీ వసూలు చేసిన 10.25 కోట్ల రూపాయల కలెక్షన్లను మాత్రం అధిగమించింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











