Padayappa Re Release Collections: రజనీకాంత్ బాక్సాఫీస్ సంచలనం.. పడయప్పా సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే
సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం పడయప్ప. 1999 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో నరసింహ పేరుతో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రమ్యకృష్ణ పోషించిన నీలాంబరి పాత్ర ఆల్ టైమ్ ఫేవరేట్‌గా మిగిలిపోయింది. ఈ చిత్రంలో సౌందర్య, అబ్బాస్, సితార, నాజర్, రాధా రవి తదితరులు నటించారు. లెజెండరీ యాక్టర్ శివాజీ గణేషన్ కీలక పాత్రలో నటించారు.
ఈ చిత్రానికి మ్యాజిక్ మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా, ఎస్ మూర్తి, ప్రసాద్ సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వర్తించారు. కే తనిగాచలం ఎడిటింగ్ బాధ్యతలను పర్యవేక్షించారు. అరుణాచల సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాను కే సత్యనారాయణ, ఎంవీ కృష్ణారావు, కే విట్టల్ ప్రసాద్ రావు, పీఎల్ తేనప్పన్ నిర్మించారు.

యాక్షన్, రివేంజ్, లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం 1999 సంవత్సరంలో ఈ చిత్రం రిలీజై తమిళ ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను సాధించింది. రజనీకాంత్, రమ్యకృష్ణ పోటాపోటీగా నటించారు. నీలాంబరి పాత్రలో ఆమె తన నట విశ్వరూపాన్ని చూపించారు. రజనీకాంత్ తన కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో లవ్, ఎమోషనల్ డ్రామాగా మార్చారు. రజనీ తన కెరీర్ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా తన 75వ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేశారు.
పడయప్పా చిత్రం తెలుగులో నరసింహ మూవీగా రిలీజై తమిళనాడు బాక్సాఫీస్ రేంజ్‌లో కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో తొలి రోజు 3.15 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 32.7 కోట్ల రూపాయలు, నైజాంలో 3.11 కోట్ల రూపాయలు, పాండిచ్చేరిలో 3 లక్షలు, కేరళలో 3 లక్షలు, ఇతర ప్రాంతాల్లో 73 లక్షలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం 3.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ సినిమా రీ రిలీజ్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. నార్త్ అమెరికాలో 21.6K డాలర్లు, శ్రీలంకలో 7K డాలర్లు, మిగితా దేశాల్లో 27K డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా మొదటి రోజు 4.10 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక రెండో రోజు కూడా ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. తొలి రోజుకు ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం మొత్తంగా 4.5 కోట్ల రూపాయలను రెండో రోజు వరల్డ్ వైడ్‌గా సాధించింది. దాంతో ఈ చిత్రం మొత్తంగా 8.6 కోట్ల రూపాయలు రాబట్టినట్టు సమాచారం. ఓవర్సీస్ కలెక్షన్ల వివరాలు పూర్తిగా వెల్లడి కావాల్సి ఉంది. ఒకవేళ ఆ వసూళ్లు పెరిగితే.. ఇంకా ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











