షాకింగ్‌గా పడిపడి లేచె మనసు కలెక్షన్లు.. శర్వానంద్‌కు తొలి దెబ్బ!
భారీ అంచనాల మధ్య విడుదలైన పడి పడి లేచె మనసు తొలివారాంతంలో పెద్దగా ఆకట్టుకొన్న ప్రయత్నం జరిగినట్టు కనిపించలేదు. మరో హిట్టు కొట్టాలనుకొన్న సాయిపల్లవి, శర్వానంద్‌కు ఈ చిత్రం పెద్ద ఝలక్ ఇచ్చినట్టు కనిపిస్తున్నది. తొలి వారాంతం ముగిసేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో సానుకూల అంకెలు కనిపించకపోవడం గమనార్హం. వసూళ్ల వివరాల్లోకి వెళితే..

27 కోట్ల బడ్జెట్‌తో
శర్వానంద్, సాయిపల్లవి కాంబినేషన్‌లో పడి పడి లేచె మనసు సినిమాను నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చక్కపల్లి రూపొందించారు. ఈ చిత్రాన్ని సుమారు రూ.27 కోట్ల బడ్జెట్‌తో రూపొందించినట్టు సమాచారం. సాయిపల్లవి, శర్వానంద్ కాంబినేషన్ కావడంతో మంచి ఆదర్ణ లభించింది.

ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లో
పడి పడి లేచె మనసు చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజున రూ.5.10 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాల్లో వసూళ్లు ఊపందుకొంటాయనే అనుకొన్న ట్రేడ్ వర్గాలకు భారీ షాక్‌ను ఇచ్చినట్టు కనిపిస్తున్నది. గత మూడు రోజుల్లో రూ.11.50 కోట్లు వసూలు చేసింది.

భారీ రేంజ్‌లో ప్రీ రిలీజ్ బిజినెస్
పడి పడి లేచె మనసు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. థియేట్రికల్ హక్కుల అమ్మకం ద్వారా రూ.19 కోట్లు వచ్చాయి. తొలి వారాంతంలో కేవలం రూ.4.75 కోట్లు మాత్రమే డిస్టిబ్యూటర్లకు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. హను రాఘవపుడి రూపొందించిన చిత్రంపై సినీ విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతన్నది.

శర్వానంద్‌కు తొలి ఫ్లాప్?
గత నాలుగైదు సంవత్సరాల్లో శర్వానంద్ భారీ విజయాలు సాధిస్తూ ఓ రెంజ్‌కు చేరుకొన్నాడు. అయితే పడి పడి లేచె మనసు మాత్రం సక్సెస్ ఇంకా దూరంగానే కనిపిస్తున్నది. ఒకవేళ ఊహించిన లాభాలు రాకపోతే, గత నాలుగైదు ఏళ్లలో కెరీర్‌లోనే తొలి ఫ్లాప్‌ను శర్వా మూటగట్టుకోవడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











