Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పడిపడి లేచే మనసు కలెక్షన్లు.. శర్వా కెరీర్లోనే.. ఊహించని నష్టాల్లో..!
గత నాలుగు, ఐదేళ్లకుపైగా దూసుకెళ్తున్న యువ హీరో శర్వానంద్ విజయాల పరంపరకు బ్రేక్ పడింది. భారీ అంచనాలతో రిలీజైన పడి పడి లేచే మనసు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. శర్వానంద్, సాయిపల్లవి జోడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తొలి ఆట నుంచి మూటగట్టుకొన్న మిశ్రమ స్పందనను పాజిటివ్ టాక్‌గా మార్చుకోలేకపోవడంతో కలెక్షన్లు వెలవెలబోయాయి. పడిపడి లేచే మనసు కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
హను రాఘవపూడి తడబాటు
పడి పడి లేచే మనసులో ఫీల్‌గుడ్ సినిమాకు కావాల్సిన కథ ఉంది. కానీ దానిని సరిగా తెరకెక్కించలేక తడబాటుపడటం హను రాఘవపూడి వంతైంది. అందం, అభినయం కలిసిన హీరోయిన్ సాయి కుమార్. ఏ పాత్రైనా ఎన్నడూ అన్యాయం చేయని హీరో శర్వానంద్. మంచి సంభాషణలు, సినిమాటోగ్రఫి మరెన్నో సాంకేతిక అంశాలు ఉన్నప్పటికీ హను ప్రేక్షకుడిని మెప్పించలేకపోయారు.
రూ.15 కోట్ల మేర నష్టం
ఇక పడి పడి లేచే మనసు చిత్రం రూ.22.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు ట్రేడ్ రిపోర్టు. తొలివారం ముగిసే సమయానికి దారుణమైన వసూళ్లను రాబట్టుకొన్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం తొలివారం తర్వాత సుమారు రూ.7.5 కోట్లు వద్ద ఆగిపోయినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అంటే దాదాపు డిస్టిబ్యూటర్లకు రూ.15 కోట్ల వరకు నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
Poll: ఉత్తమ తెలుగు ప్రతినాయకుడు 2018
నైజాంలో, సీడెడ్, ఉత్తరాంధ్రలో
తొలివారం తర్వాత నైజాంలో వసూళ్లు క్రమేపి క్షీణించినట్టు ట్రేడ్ రిపోర్ట్ వెల్లడించింది. నైజాంలో రూ.2.44 కోట్లు వసూలు చేసింది. అలాగే సీడెడ్‌లో రూ.75 లక్షలకే పరిమితమైనట్టు వెల్లడైంది. ఇక ఉత్తరాంధ్రలో ఈ చిత్రం రూ.70 లక్షలు మాత్రమే వసూలు చేసినట్టు సమాచారం.
ఆంధ్రాలో వారం కలెక్షన్లు
రెండో వారాంతం తర్వాత ఇక ఆంధ్రాలోని ప్రధానమైన జిల్లాలో గుంటూరులో రూ.57 లక్షలు, తూర్పు గోదావరి రూ.40 లక్షలు, పశ్చిమ గోదావరి రూ.30 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.40 లక్షలు, నెల్లూరులో రూ.25 లక్షల మేర కలెక్షన్లు వసూలు చేసింది.
Poll: ఉత్తమ కొత్త తెలుగు నటి 2018
ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
తెలంగాణ, ఆంధ్రాలను మినహాయిస్తే పడి పడి లేచే మనసు చిత్రం మిగితా రాష్ట్రాల్లో రూ.45 లక్షలు మాత్రమే సాధించింది. ఇక ఓవర్సీస్లో కోటి రూపాయల వరకు రాబట్టినట్టు తెలిసింది. మొత్తంగా ఈ చిత్రం రెండో వారాంతం తర్వాత రూ.7.5 కోట్ల వద్ద సెటిల్ అయినట్టు తెలుస్తున్నది.