twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భాక్సాఫీస్: ‘పైసా’ ఇక్కడ ఓకే ....అక్కడ దారుణం

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎంతో కాలంగా ఊరిస్తూ వచ్చిన 'పైసా' చిత్రం ఎట్టకేలకు మొన్న శుక్రవారం రిలీజ్ అయింది. మార్నింగ్ షో కే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ వీకెండ్ కి రాష్ట్రంలో మూడు కోట్ల వరకూ షేర్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ మాత్రం ఏరియా వైజ్ గా చాలా తేడా గా ఉన్నాయి . ముఖ్యంగా నైజాం...ఏరియా(హైదరాబాద్)లో బాగున్నాయి. సినిమాలో ఎక్కువ భాగం ఓల్డ్ సిటీ ప్లేవర్ ఉండటంతో నైజాంకు ప్లస్ అయ్యింది. అదే సీమాధ్ర,సీడెడ్ లలో ఫెయిలైంది. నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ 'పైసా' చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మించారు. నాని సరసన కేథరీన్ నటించింది.

    పాత బస్తీలోని షేర్వాణీ దుకాణంలో మోడల్‌ ప్ర'క్యాష్' (నాని)కి డబ్బంటే పిచ్చి. ఎలాగైనా కోటీశ్వరుడు అయిపోవాలనుకునే అతన్ని ఓ పేద ముస్లిం అమ్మాయి నూర్జహాన్‌ (కేథరిన్‌) ప్రేమిస్తుంది. అయితే డబ్బే ముఖ్యం అనుకునే ప్రకాష్ ఆమెను నిర్లక్ష్యం చేయటంతో ఆమె ఓ ముసలి షేక్ ని వివాహం చేసుకోవానికి సిద్దపడుతుంది. అది తెలిసిన ప్రకాష్ ఆమెను సేవ్ చేసే ప్రాసెస్ లో ఓ వెహికల్ తో పారిపోతాడు. ఆ వెహికల్ లో ఓ మినిస్టర్ (చరణ్ రాజ్) ఎన్నికల కోసం పంపిన హవాలా డబ్బు 50 కోట్లు ఉంటుంది. అక్కడ నుంచి కథ మలుపు తిరిగుతుంది. చివరకు నూర్జహాన్ ప్రేమను ఒప్పుకున్నాడా... ఆ డబ్బు ఏమైంది అనేది మిగతా కథ.

    Paisa decent opening in Nizam Pretty poor outside

    కృష్ణవంశీ మాట్లాడుతూ...పచ్చనోటు అన్వేషణలోనే జీవితం గడిచిపోతోంది. మనిషి ఆశ.. శ్వాస.. పైసానే. అందుకోసమే ఎన్ని ఎత్తులేసినా, ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా. మా హీరో పైసల కోసమే పోరాటం చేశాడు. అది ఎందుకు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు.

    అలాగే... ''డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

    నిర్మాత మాట్లాడుతూ ''పేరుకు తగ్గట్టుగా పైసా వసూల్‌ సినిమా ఇది. టిక్కెట్టు రేటుకు తగిన వినోదం గిట్టుబాటు అవుతుంది. కృష్ణవంశీ శైలిలోనే విభిన్నంగా సాగే ఈ సినిమా నాని కెరీర్‌లో ఓ మైలురాయిగా మిగిలిపోతుందన్న నమ్మకం ఉంది''అన్నారు. సంగీతం: సాయికార్తీక్‌, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రాజారవీంద్ర.

    English summary
    Paisa collected 3Cr Share in its opening weekend in the State. The film is decent in Nizam with almost half from the area thanks to Hyderabad. Paisa is pretty poor in Seemandhra and especially Ceeded where it has failed to take off despite a solo release.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X