»   »  వార్నింగులు, ఉద్రిక్తత: ‘ఎంఎస్ ధోనీ’ సినిమాపై పాకిస్థాన్ బ్యాన్

వార్నింగులు, ఉద్రిక్తత: ‘ఎంఎస్ ధోనీ’ సినిమాపై పాకిస్థాన్ బ్యాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూరి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. దాదాపుగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఉద్రిక్త వాతావరణం ఎఫెక్ట్ సినిమా పరిశ్రమపై కూడా పడింది.

ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతున్న ప్రముఖ క్రికెట్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'ఎంఎస్ ధోనీ' చిత్రాన్ని పాకిస్థాన్ లో విడుదల కావడం లేదు. ఈ సినిమాపై పాకిస్థాన్ లో నిషేదం విధించారు.

పాకిస్థాన్ కు చెందిన సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 'ఐఎంజిసి గ్లోబల్ ఎంటర్టెన్మెంట్స్' ఈ చిత్రానికి సంబంధించిన హక్కులను దక్కించుకుంది. అయితే పరిస్థితి సినిమా విడుదలకు అనుకూలంగా లేక పోవడంతో ఆ సంస్థ కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకుంది.

 పాక్ నటులకు వార్నింగులు

పాక్ నటులకు వార్నింగులు

ఈ మధ్య కాలంలో పలువురు పాకిస్థాన్ కు చెందిన నటీనటులు బాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లో విడుదల కాబోతున్న కరణ్ జోహార్ దర్శకత్వంలో ఐశ్వర్యరాయ్, రణబీర్ కపూర్, అనుష్క శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రంలో ఫవాద్ ఖాన్ అనే పాకిస్థాన్ నటుడు నటిస్తున్నాడు. ఇతడితో పాటు బాలీవుడ్లో నటిస్తున్న పాకిస్థాన్ నటులకు మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) వార్నింగ్ ఇచ్చింది. వెంటనే అంతా ఇండియా వదిలి పాకిస్థాన్ వెళ్ళాలని బెదరింపులకు పాల్పడింది.

 నిషేదం అందుకే

నిషేదం అందుకే

భారత్ లోని రాజకీయ పార్టీల నుండి తమ దేశ నటులకు బెదిరింపులు వస్తుండటం, ఇరు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో ఎంఎస్ ధోనీ సినిమాపై పాకిస్థాన్ నిషేదం విధించినట్లు తెలుస్తోంది.

 పాక్ లోనూ ధోనికి అభిమానులు

పాక్ లోనూ ధోనికి అభిమానులు

ధోని అట అంటే భారతీయులకు మాత్రమే కాదు.... పాకిస్థాన్ లోనూ ఆయనకు భారీగా అభిమానులు ఉన్నారు. సాధారణ టికెట్ కలెక్టర్ నుండి ఇంటర్నేషనల్ క్రికెటర్ గా ధోని ఎదిగిన వైనాన్ని చూసేందుకు అక్కడ చాలా మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. సినిమా విడుదలకు అందుకు తగిన విధంగానే భారీగా ఏర్పాట్లు చేసారు. అయితే విడుదల సమయానికి పరిస్థితి తారుమారైంది.

 అంచనాలు భారీగా

అంచనాలు భారీగా

ధోనీ క్రికెట్ జీవితం మాత్రమే మనకు తెలుసు. ఈ సినిమాలో ధోనీ చిన్నతనం, క్రికెటర్ గా ఎదిగిన వైనం, ఈ స్థాయికి రావడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత శ్రమించారు అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ధోనీ పాత్రలో బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్నాడు. ధోనీ భార్య సాక్షి రావత్ పాత్రలో కైరా అద్వానీ నటిస్తున్నారు. భూమిక చావ్లా, దిశా పటాని కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 తెరపైకి లక్ష్మిరాయ్

తెరపైకి లక్ష్మిరాయ్

కాగా.... ఉన్నట్టుండి హీరోయిన్ లక్ష్మీరాయ్ పేరు తెరపైకి వచ్చింది. ధోనీ జీవితం గురించి సినిమా వస్తున్న నేపథ్యంలో అతనితో ఎఫైర్ నడిపిందంటూ గతంలో వార్తల్లో నలిగిన లక్ష్మీరాయ్ గురించి కూడా సినిమాలో ఉంటుందా? అనేది చర్చనీయాంశం అయింది.

లక్ష్మీరాయ్ స్పందన

లక్ష్మీరాయ్ స్పందన

లక్ష్మీరాయ్ స్పందన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సమయంలో ధోనీతో పరిచయం నిజమే. ఎఫైర్ లో నిజం లేదు, మేమెప్పుడూ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. ఆ ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ధోనీతో టచ్ లో లేను అన్నారు లక్ష్మిరాయ్.

 ధోనీకి లవర్ ఉంది, సినిమాలో సీన్ ఉంది

ధోనీకి లవర్ ఉంది, సినిమాలో సీన్ ఉంది

రియల్ లైఫ్ లో ధోనీకి లవర్ ఉంది. ఆమె పేరు ప్రియాంక ఝా. అయితే ఆమె యాక్సిడెంటులో మరణించింది. తర్వాత ధోనీ సాక్షి రావత్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

 రామ్ చరణ్ ఉన్నాడా

రామ్ చరణ్ ఉన్నాడా

ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నాని, ధోనీకి అత్యంత సన్నిహితుడైన సురేష్ రైనా పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారని సినిమా మొదలైనప్పటి నుండి ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం మాత్రం లేదు. సినిమా విడుదల దగ్గర పడుతున్న వేళ ఇది మళ్లీ తెరపైకి వచ్చింది.

English summary
Allegedly reposing to the chauvinistic call of Maharashtra Navnirman Sena (MNS) to throw all the Pakistani artistes out of India, the neighboring country has decided to ban the upcoming biopic of MS Dhoni.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu