Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Pakka Commercial day 1 collections గోపిచంద్ కెరీర్లోనే ది బెస్ట్.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
సెన్సిబుల్ డైరెక్టర్ మారుతి, మ్యాచో హీరో గోపిచంద్, అందాల భామ రాశీఖన్నా కాంబినేషన్లో వచ్చిన పక్కా కమర్షియల్ చిత్రం అంచనాలు మించి వసూళ్లను సాధించింది. తొలి ఆట నుంచి వచ్చిన మిక్స్డ్ టాక్‌ను అధిగమించి తొలి రోజు భారీ కలెక్షన్లు సాధించింది. రిలీజ్‌కు ముందు క్రియేట్ అయిన బజ్, మౌత్ టాక్‌తో మంచి ఆక్యుపెన్సీ నమోదైంది. ఫన్, హిలేరియస్ కామెడీతో రూపొందిన పక్కా కమర్షియల్ చిత్రం తొలి రోజు ఎంత వసూలు సాధించిందంటే?
కామెడీ, ఫన్ ఎలిమెంట్స్‌తో
పక్కా కమర్షియల్ సినిమా కథ విషయానికి వస్తే.. న్యాయ వ్యవస్థలో అవినీతిపై సైటరికల్ ఎంటర్టైనర్గా రూపొందింది. మారుతి తనదైన శైలిలో కామెడీ, ఫన్ ఎలిమింట్స్‌తో కథను పరుగులు పెట్టించారు. గోపిచంద్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, యాటిట్యూబ్, లుక్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. స్టైలిష్ యాక్షన్ సీన్లు మాస్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఇక రాశీఖాన్నా సరికొత్తగా తన ఫెర్ఫార్మెన్స్‌తో ఇరగదీసిందనే చెప్పాలి. రాశీఖన్నా, సప్తగిరి కామెడీ ట్రాక్ నవ్వులు పూయించింది.
ప్రపంచవ్యాప్తంగా 900 స్క్రీన్లలో
పక్కా కమర్షియల్ సినిమా టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు పెరగడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. నైజాంలో 235 థియేటర్లు, సీడెడ్‌లో 120, ఆంధ్రాలో 270 థియేటర్లకుపైగా రిలీజ్ అయింది. ఓవర్సీస్లో 250 స్క్రీన్లు, కర్ణాటక ఇతర ప్రాంతాల్లో 80 స్క్రీన్లలో సినిమాను రిలీజ్ చేశారు. గోపిచంద్ కెరీర్లోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా థియేటర్ కౌంట్ భారీగా 900 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడం ఓ రికార్డుగా చెప్పుకోవచ్చు.
రికార్డుస్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక పక్కా కమర్షియల్ సినిమా ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. నైజాం ఏరియాలో 6 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఆంధ్రాలో 9 కోట్లుగా బిజినెస్ నమోదైంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 17.50 కోట్లుగా బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటక థియేట్రికల్ హక్కులు 50 లక్షలు, ఓవర్సీస్ హక్కులు సుమారు 1 కోటికపైగా అమ్ముడుపోయాయి. దాంతో ఈ చిత్రం 19 కోట్లకుపైగా బిజినెస్ జరిగింది.
తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
దర్శకుడు మారుతి, గోపిచంద్ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడంతో తొలి రోజు భారీ స్పందన వ్యక్తమైంది. పక్కా కమర్షియల్ చిత్రం మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 6.3 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేసింది. ఈ రేంజ్ కలెక్షన్లతో గోపిచంద్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పక్కా కమర్షియల్ ఓ ఘనతను సాధించింది. వీకెండ్లో పక్కా కమర్షియల్‌కు మంచి రెస్సాన్స్ లభిస్తున్నట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.