Pallichattambi Day 1 Collections: పల్లిచట్టంబి బాక్సాఫీస్ కలెక్షన్స్.. టొవినో థామస్ మూవీకి ఎన్ని కోట్లంటే?

వైవిధ్యమైన సినిమాలతో మలయాళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగారు టొవినో థామస్. తాజాగా ఆయన నటించిన చిత్రం పల్లిచట్టంబి. టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో హైప్ పెంచింది. పల్లిచట్టంబిలో టొవినో థామస్ సరసన యంగ్ హీరోయిన్ కాయదు లోహర్ జంటగా నటించారు. ఈ చిత్రానికి డిజో ఆంటోనీ దర్శకత్వం వహించారు. ఈ నేపథ్యంలో పల్లిచట్టంబి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు టొవినో థామస్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

పల్లిచట్టంబి తారాగణం
వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నౌఫాల్, బ్రిటజీష్, చాణక్య, చైతన్య, చరణ్‌లు సంయుక్తంగా పల్లిచట్టంబి సినిమాను నిర్మించారు. విజయ రాఘవన్న, సిద్ధిఖీ, సుధీర్ కారమాణ, బాబు రాజ్, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు ఈ సినిమాలో నటించగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. టిజో టామీ సినిమాటోగ్రఫి, శ్రీజిత్ సారంగ్‌లు ఎడిటర్లుగా వ్యవహరించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 15న పల్లిచట్టంబి రిలీజ్ అయ్యింది.

Pallichattambi Day 1 Expected Box Office Collections Worldwide Tovino Thomas s film good start at GBOC

పల్లిచట్టంబి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పల్లిచట్టంబి మూవీని దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. టొవినో థామస్ క్రేజ్.. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో పల్లిచట్టంబి మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. టొవినో థామస్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పల్లిచట్టంబి అడ్వాన్స్ బుకింగ్
విడుదలకు ముందు హైప్ నేపథ్యంలో పల్లిచట్టంబి మూవీకి అడ్వాన్స్ బుకింగ్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 7 గంటల వరకు అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం టొవినో థామస్ మూవీకి ఇండియాలో ప్రీ సేల్స్ కింద కేరళలో 1.22 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 10 లక్షల రూపాయలు, తమిళనాడులో 5.50 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 1.50 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 1.70 లక్షల రూపాయల చొప్పున ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 1.41 కోట్ల రూపాయలు రాబట్టాడు టొవినో థామస్. బుక్ మై షోలో గడిచిన 24 గంటల్లో 41.52K టికెట్లు అమ్ముడయ్యాయి. ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 45k డాలర్లు (42 లక్షల రూపాయలు) వసూలు చేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పల్లిచట్టంబి తొలిరోజు కలెక్షన్స్
పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌కు తోడు టొవినో థామస్ ట్రాక్ రికార్డ్‌తో పల్లిచట్టంబి మూవీపై హైప్ నెలకొంది. అయితే కేవలం మలయాళంలో మాత్రమే ఈ సినిమా హవా చూపిస్తుండగా.. మిగిలిన చోట్ల అంతంత మాత్రంగానే ఆక్యూపెన్సీ నమోదైంది. తెలుగు వెర్షన్‌లో ఏప్రిల్ 17వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఆంధ్రా, నైజాంలలో ప్రస్తుతానికి పల్లిచట్టంబి మలయాళ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.

ఇప్పటి వరకు ఇండియాలో పల్లిచట్టంబి సినిమాకు 488 షోలు ప్రదర్శితమై.. 44 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. బెంగళూరులో 129 షోలు, త్రివేండ్రంలో 92 షోలు, కొచ్చిలో 85 షోలు, కోజికోడ్‌లో 60 షోలు ప్రదర్శితమయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం.. ఇండియాలో 73 లక్షల రూపాయల నెట్ వసూలైంది. తొలిరోజు పల్లిచట్టంబి మూవీకి కేరళలో 3 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 20 లక్షల రూపాయలు, తమిళనాడులో 10 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 10 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 6 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X