Pallichattambi Day 2 Collections: పల్లిచట్టంబికి వజా 2 సవాల్... టొవినో థామస్ మూవీకి వసూళ్లు ఎంతంటే?

డిజో ఆంటోనీ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, యంగ్ బ్యూటీ కాయదు లోహర్ జంటగా నటించిన మూవీ పల్లిచట్టంబి. వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నౌఫాల్, బ్రిటజీష్, చాణక్య, చైతన్య, చరణ్‌లు సంయుక్తంగా పల్లిచట్టంబి సినిమాను నిర్మించారు. విజయ రాఘవన్న, సిద్ధిఖీ, సుధీర్ కారమాణ, బాబు రాజ్, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు ఈ సినిమాలో నటించగా.. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. టిజో టామీ సినిమాటోగ్రఫి, శ్రీజిత్ సారంగ్‌లు ఎడిటర్లుగా వ్యవహరించారు. పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 15న పల్లిచట్టంబి వరల్డ్ వైడ్‌టగా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పల్లిచట్టంబి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు టొవినో థామస్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

పల్లిచట్టంబి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పల్లిచట్టంబి మూవీని దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. టొవినో థామస్ క్రేజ్.. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో పల్లిచట్టంబి మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. టొవినో థామస్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Pallichattambi Day 2 Expected Box Office Collections Worldwide Tovino Thomas s film faces from vaazha 2

పల్లిచట్టంబి తొలిరోజు కలెక్షన్స్
టొవినో థామస్ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 8.20 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. తొలిరోజున ఇండియాలో 1.55 కోట్ల రూపాయల నెట్.. 2.37 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేయగా, ఓవర్సీస్‌లో 2.50 కోట్ల రూపాయలు రాబట్టినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తొలిరోజు రాత్రి 8 గంటల వరకు పల్లిచట్టంబి మూవీకి ఇండియా వైడ్‌గా 1260 షోలు ప్రదర్శితమయ్యాయి. ఇటీవల విడుదలైన వజా 2 కంటే పల్లిచట్టంబి మూవీ ఓపెనింగ్స్ తగ్గడం ఆశ్చర్యపరుస్తోంది. కొత్త కుర్రాళ్లు తీసిన వజా 2 తొలిరోజున ఇండియాలో 4.75 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం.

కేరళ రాష్ట్రం ఈ సినిమాకు వెన్నుదన్నుగా నిలిచింది. ఉదయం 32 శాతం, సాయంత్రం 42 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. వజా 2 థియేటర్లలో ఇంకా నడుస్తుండటం, ఎన్నికల వేడితో పాటు ఐపీఎల్ సీజన్ నుంచి పల్లిచట్టంబిపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అయితే వీకెండ్‌లో టొవినో థామస్ మూవీ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొచ్చి, బెంగళూరులలో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

పల్లిచట్టంబి రెండు రోజు వసూళ్ల అంచనా
బుక్ మై షోలో పల్లిచట్టంబి మూవీకి గడిచిన 24 గంటల్లో 81.1K టికెట్లు అమ్ముడైనట్లుగా వార్తలు వస్తున్నాయి. కేరళలో విషు పర్వదినం సందర్భంగా కొంతమేరకు బుకింగ్స్ పెరిగినట్లుగా తెలుస్తోంది. రెండో రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సినిమాకు ఇండియాలో 283 షోలు ప్రదర్శితమయ్యాయి. ఉదయం ఆటలకు 31 శాతం, మధ్యాహ్నం షోలకు 45 శాతం మేర థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా తెలుస్తోంది. రెండో రోజు టొవినో థామస్ మూవీకి కేరళలో 3 కోట్ల రూపాయలు, తమిళనాడు + రెస్టాఫ్ ఇండియాలో 1.50 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 6 కోట్ల రూపాయలు వసూలు చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X