Pallichattambi Day 3 Collections: పల్లిచట్టంబి బాక్సాఫీస్ కలెక్షన్స్.. టొవినో థామస్ మూవీకి 3వ రోజు ఎంతంటే?

వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నౌఫాల్, బ్రిటజీష్, చాణక్య, చైతన్య, చరణ్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం పల్లిచట్టంబి. మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, యంగ్ బ్యూటీ కాయదు లోహర జంటగా నటించారు. విజయ రాఘవన్న, సిద్ధిఖీ, సుధీర్ కారమాణ, బాబు రాజ్, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also Read
'అలా మద్యానికి బానిసనయ్యా.. ఆ పరిస్థితుల్లో తాగుడుకు అలవాటు పడ్డా’
'అలా మద్యానికి బానిసనయ్యా.. ఆ పరిస్థితుల్లో తాగుడుకు అలవాటు పడ్డా’

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గెస్ట్ రోల్‌లో అలరించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. టిజో టామీ సినిమాటోగ్రఫి, శ్రీజిత్ సారంగ్‌లు ఎడిటర్లుగా వ్యవహరించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 15న పల్లిచట్టంబి రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పల్లిచట్టంబి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు టొవినో థామస్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Pallichattambi Day 3 Expected Box Office Collections Worldwide Tovino Thomas s film faces tough fight with friday releases

పల్లిచట్టంబి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పల్లిచట్టంబి మూవీని దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. టొవినో థామస్ క్రేజ్.. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో పల్లిచట్టంబి మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. టొవినో థామస్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

Recommended For You
Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?
Rakasa Closing Collections: రాకాస క్లోజింగ్ కలెక్షన్స్.. నిహారిక కొణిదెల మూవీకి లాభమెంత? నష్టమెంత?

పల్లిచట్టంబి రెండు రోజుల కలెక్షన్స్
పల్లిచట్టంబి మూవీ 10.34 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది. తొలిరోజున 2.90 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.65 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో రెండ్రోజుల్లో 4.55 కోట్ల రూపాయల నెట్.. 5.24 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైనట్లు సాక్‌నిక్ తెలిపింది. నార్త్ అమెరికా, యూరప్, యూకే, సింగపూర్, మలేషియా, గల్ఫ్ దేశాలలో దాదాపు 2 కోట్ల రూపాయలకు పైగా పల్లిచట్టంబి రాబట్టినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రెండ్రోజుల్లో కేరళలో 4.80 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 27 లక్షల రూపాయలు, తమిళనాడులో 8 లక్షల రూపాయలు, ఏపీ, తెలంగాణలలో 3 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 6 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

You May Also Like
యాక్టింగ్‌కు శోభా శెట్టి గుడ్‌బై? దిమ్మతిరిగేలా కార్తీక దీపం విలన్ రిప్లయ్
యాక్టింగ్‌కు శోభా శెట్టి గుడ్‌బై? దిమ్మతిరిగేలా కార్తీక దీపం విలన్ రిప్లయ్

పల్లిచట్టంబి మూడో రోజు వసూళ్ల అంచనా
పల్లిచట్టంబి ఇప్పటికే మలయాళం, తమిళ్, కన్నడ భాషలలో అందుబాటులో ఉంది. కేరళలలో మాత్రమే ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో టొవినో థామస్ మూవీ వసూళ్లు రాబడుతోంది. అయితే ఏప్రిల్ 17 నుంచి తెలుగు వెర్షన్‌లో పల్లిచట్టంబి రిలీజ్ కానుండటంతో బుకింగ్స్ పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తగినట్లుగానే గడిచిన 24 గంటల్లో బుక్ మై షోలో దాదాపు 50K టికెట్లు అమ్ముడైనట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే తెలుగులో డెకాయిట్‌కి తోడు ఏప్రిల్ 17న తిమ్మరాజుపల్లి టీవీ, పాపం ప్రతాప్, బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీల నుంచి టొవినో థామస్ మూవీకి గట్టి పోటీ తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.

రష్మి లవ్ ఫెయిల్యూర్... అతని ట్రాప్‌లో అలా ఇరుక్కున్న స్టార్ యాంకర్
రష్మి లవ్ ఫెయిల్యూర్... అతని ట్రాప్‌లో అలా ఇరుక్కున్న స్టార్ యాంకర్

మూడో రోజు పల్లిచట్టంబి మూవీకి మధ్యాహ్నం 1 గంట వరకు 383 షోలకు గాను 13 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. 3వ రోజు ఇప్పటి వరకు ఇండియాలో పల్లిచట్టంబి మూవీకి 15 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లు నివేదికలు చెబుతున్నారు. శుక్రవారం ఈ సినిమాకు కేరళలో 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రూపాయలు, తమిళనాడు + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 3వ రోజు వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X