Pallichattambi Day 5 Collections: పల్లిచట్టంబి కలెక్షన్స్‌పై ఊహించని దెబ్బ.. టొవినో థామస్ మూవీకి ఎంతంటే?

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్, యంగ్ హీరోయిన్ కాయదు లోహర్ జంటగా నటించిన మూవీ పల్లిచట్టంబి. వరల్డ్ వైడ్ ఫిలింస్, సీ క్యూబ్ బ్రదర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నౌఫాల్, బ్రిటజీష్, చాణక్య, చైతన్య, చరణ్‌లు నిర్మించగా డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించారు. విజయ రాఘవన్న, సిద్ధిఖీ, సుధీర్ కారమాణ, బాబు రాజ్, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గెస్ట్ రోల్‌లో అలరించారు.

జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా.. టిజో టామీ సినిమాటోగ్రఫి, శ్రీజిత్ సారంగ్‌లు ఎడిటర్లుగా వ్యవహరించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 15న పల్లిచట్టంబి రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో పల్లిచట్టంబి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు టొవినో థామస్ మూవీ ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

Pallichattambi Day 5 Expected Box Office Collections Worldwide Tovino Thomas s film Sees Dip

పల్లిచట్టంబి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి పల్లిచట్టంబి మూవీని దాదాపు 45 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించినట్లుగా మలయాళ సినీ వర్గాలు చెబుతున్నాయి. టొవినో థామస్ క్రేజ్.. టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో పల్లిచట్టంబి మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీగా జరిగింది. టొవినో థామస్ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 90 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

పల్లిచట్టంబి నాలుగు రోజుల కలెక్షన్స్
టొవినో ధామస్ మూవీకి తొలిరోజున 2.90 కోట్ల రూపాయలు, రెండో రోజున 1.65 కోట్ల రూపాయలు, మూడో రోజున 1.18 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 1.10 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 6.83 కోట్ల రూపాయల నెట్.. 7.58 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సాక్‌నిక్ పేర్కొంది. ఇక మూడు రోజుల వరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పల్లిచట్టంబి మూవీకి కేరళలో 6.03 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 31 లక్షల రూపాయలు, తమిళనాడులో 10 లక్షల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 7 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 8 లక్షల రూపాయలు చొప్పున వసూలు చేసింది.

పల్లిచట్టంబి ఓవర్సీస్ కలెక్షన్స్
నార్త్ అమెరికాతో పాటు గల్ఫ్, సింగపూర్, మలేషియా, యూకే, యూరప్ తదితర దేశాలలో కలిపి పల్లిచట్టంబి మూవీకి ఓవర్సీస్‌లో 3 రోజుల వరకు 5.90 కోట్ల రూపాయలు వచ్చినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. దాంతో మూడు రోజుల వరకు ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి వరల్డ్ వైడ్‌గా 13.40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలైంది

పల్లిచట్టంబి ఐదో రోజు వసూళ్ల అంచనా
గ్రామీణ వాతావరణం, పీరియాడికల్ మూవీ కావడంతో టొవినో థామస్ మూవీ అనుకున్న స్థాయిలో ఆదరణను దక్కించుకోలేకపోతోంది. కేవలం బీ, సీ సెంటర్లలో మాత్రమే కాస్తో కూస్తో ఆక్యూపెన్సీ అందుకుంటోంది. దీనికి తోడు పలు చిత్రాల నుంచి గట్టి పోటీ కూడా వసూళ్లపై ప్రభావం చూపుతోంది. ఒక్క కేరళలోనే పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తుండగా మిగిలిన భాషల్లో ఈ సినిమా నిరాశపరిచినట్లుగానే కనిపిస్తోంది.

ఐదో రోజు పల్లిచట్టంబి మూవీకి మధ్యాహ్నం 2 గంట వరకు ఇండియాలో 380 షోలకు గాను 28 శాతం ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ పేర్కొంది. 5వ రోజు ఇప్పటి వరకు ఇండియాలో పల్లిచట్టంబి మూవీకి 33 లక్షల రూపాయల నెట్ వసూలైనట్లు నివేదికలు చెబుతున్నారు. ఆదివారం ఈ సినిమాకు కేరళలో 3 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షల రూపాయలు, తమిళనాడు + రెస్టాఫ్ ఇండియాలో 50 లక్షల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున 3వ రోజు వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయలు రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X