5300 కోట్ల వసూళ్లతో సంచలనం .. ఇండియన్ స్క్రీన్‌పై వన్ అండ్ ఓన్లీ ‌స్టార్‌గా ప్రభాస్

భారతదేశంలో రీజినల్ సినిమా స్థాయి మారిపోయి.. ప్రజెంట్ పాన్ ఇండియా పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఈ విషయంలో తెలుగు సినిమా అందరి కంటే ముందుంది. వందల కోట్ల బడ్జెట్‌తో, వేల కోట్ల వసూళ్లతో టాలీవుడ్ ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమను రూల్ చేస్తోంది. మన ఇండస్ట్రీ నుంచి తొలి పాన్ ఇండియా స్టార్‌గా అవతరించిన ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్లను సైతం పక్కకునెట్టేశాడు. ఇమేజ్ , మార్కెట్, వసూళ్లతో డార్లింగ్ దుమ్మురేపుతున్నాడు. తాజాగా తన పేరిట అరుదైన రికార్డును రాసుకున్నాడు ప్రభాస్.

స్నేహశీలిగా , మనసున్న మారాజుగా జేజేలు అందుకుంటున్నారు ప్రభాస్. ఇన్నేళ్ల కెరీర్‌లో ఒక్క మచ్చ కూడా లేకుండా.. ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయనను విమర్శించిన వారు లేరంటే ప్రభాస్ వ్యక్తిత్వం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. తన ఇంటికి ఎవరైనా వస్తే వారికి భోజనం పెట్టుకుండా పంపరు. తన మిత్రులు, సన్నిహితులకు బహుమతులు, స్వీట్లు పంపడం ప్రభాస్‌కు అలవాటు.

pan india star prabhas creates new record for his movies collected rs 5300 crore at box office

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో ఎవరైనా బిజీ నటుడు ఉన్నారంటే అది ప్రభాస్ అనే చెప్పాలి. కల్కి 2898 ఏడీతో మరోసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన ఆయన చేతి నిండా సినిమాలతో ఇండియాలో ఏ హీరో లేనంత బిజీగా ఉన్నారు. ది రాజా సాబ్, సలార్ 2, కల్కి 2, స్పిరిట్, హనురాఘవపూడి సినిమాలతో పాటు మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పనిలో ఆయన ఉన్నారు. అంతేకాదు డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే కావడం విశేషం.

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ది రాజా సాబ్ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారట.

కాగా తన సినిమాల కలెక్షన్స్‌ ప్రభాస్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గడిచిన ఐదేళ్లుగా ఆయన నటించిన ప్రతి చిత్రం తొలిరోజే రూ.100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టింది. ఇదొక్కటే కాదు.. తనను పాన్ ఇండియా హీరోగా మార్చిన బాహుబలి నుంచి నేటి వరకు 10 ఏళ్లలో ఆయన నటించిన 7 సినిమాలు రూ.5300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు ప్రభాస్.

బాహుబలి రూ.650 కోట్లు, బాహుబలి 2 రూ.1800 కోట్లు, సాహో రూ. 430 కోట్లు, రాధేశ్యామ్ రూ.220 కోట్లు, ఆదిపురుష్ రూ. 350 కోట్లు, సలార్ రూ. 600 కోట్లు, కల్కి 2898 ఏడీ రూ.1230 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. అలా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ప్రభాస్ ఈ సమ్మర్‌లో రాజా సాబ్‌తో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడోనని ట్రేడ్ పండితులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X