‘పాండవులు పాండవులు తుమ్మెద’బడ్జెట్ అంతా?
హైదరాబాద్ :మంచు కుటుంబ చిత్రంగా చెబుతున్న 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 31న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం దాదాపు 30 కోట్లు దాకా బడ్జెట్ అయ్యిందని మోహన్ బాబు చెప్తున్నారు. ఇప్పటివరకూ మంచు కుటుంబం నుంచి వచ్చిన ఏ చిత్రానికి అంత బడ్జెట్ కాలేదు. దాంతో మోహన్ బాబు చిత్రాల్లో హై బడ్జెట్ చిత్రంగా చెప్పుకుంటున్నారు. అయితే ఏ మేరకు బిజినెస్ అయ్యిందో తెలియరాలేదు.
'గోల్‌మాల్-3' చిత్రానికి రీమేగా శ్రీవాస్ దర్శకత్వంలో మోహన్‌బాబు, మంచు విష్ణు, మనోజ్, రవీనాటాండన్, హన్సిక ప్రధాన తారాగణంగా రూపొందుతున్న ఈ చిత్రం గూర్చి నిర్మాత విష్ణు మాట్లాడుతూ- ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తోందని, తమ్ముడు, నేను, నాన్న కలిసి తొలిసారిగా నటించిన ఈ చిత్రం వైవిధ్యంగా ఉంటుందని, మనోజ్ పోషించిన లేడీగెటప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఈనెల 31న అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేస్తున్నామని, ప్రేక్షకులు తప్పక విజయాన్ని అందిస్తారని కోరుకున్నారు.

శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్-24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాలపై అరియానా-వివియానా సమర్పణలో మంచు విష్ణువర్ధన్-మనోజ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మోహన్ బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీ స్టారర్లో రవీనా టండన్, హన్సిక, ప్రణీత హీరోయిన్లు. 'లక్ష్యం' ఫేం శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం : కీరవాణి-మణిశర్మ-బప్పిలహరి-బాబా సెహగల్, కెమెరా : ఫలణికుమార్, పాటలు: చంద్రబోస్-భాస్కరభట్ల-అనంత శ్రీరామ్, మాటలు: డైమండ్ రత్న, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్-బివిఎస్ రవి-గోపీ మోహన్, పోరాటాలు: విజయ్, ఎడిటింగ్: ఎంఆర్ వర్మ, కళ: రఘు కులకర్ణి, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విజయ్ కుమార్.ఆర్, సమర్పణ: అవియానా-వివియానా, నిర్మాతలు : మంచు విష్ణువర్ధన్, మంచు మనోజ్, దర్శకత్వం: శ్రీవాస్.


Click it and Unblock the Notifications











