మిక్స్‌డ్ టాక్‌లోనూ ‘పంజా’ కలెక్షన్స్ కేక..!
పంజా సినిమా ఎలా ఉందంటే...సూపర్ గా ఉందని కొందరు, ఏమంత బాగోలేదని మరికొందరు, ఫర్వాలేదని ఇంకొందరు ఇలా తొలిరోజే మిక్స్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో అభిమానులతో పాటు నిర్మాతలు కూడా ఒక్కసారిగా డీలా పడ్డారు. పవన్ కళ్యాణ్ ఈ సారి కూడా హిట్ కొట్టలేక పోయారు అని అంతా నిరాశలో కూరుకు పోయారు. అయితే ఇలాంటి మిక్స్ డ్ టాక్ లోనూ పంజా మంచి కలెక్షన్లే సాధించిందని సినిమా ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. తొలివారం వసూళ్లు చూస్తే మనకూ ఆశ్యర్య వేయక తప్పదు. బహుషా ఎక్కువ థియేటర్లలో విడుదల కావడం వల్లనే ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్లు వచ్చి ఉండొచ్చు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రూ. 33 కోట్లతో తెరకెక్కిన పంజా సినిమా మొత్తం 1800 థియేటర్లలో 8000వేల షోలతో ప్రారంభం అయింది. తొలివారంలో మొత్తం రూ. 50.7 కోట్ల వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. డై బై డే పంజా కలెక్షన్లు పడిపోవడాన్ని చూస్తే....అతి త్వరలోనే పంజాను థియేటర్ల నుంచి ఎత్తేయడమూ ఖాయం అని చర్చించుకుంటున్నారు.
పంజా తొలివారం ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు (సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మాత్రమే)
శుక్రవారం(తొలిరోజు) : రూ. 16. 2 కోట్లు(ప్రీమియర్ షోలతో కలిపి)
శనివారం (రెండో రోజు) : రూ. 10.1 కోట్లు
ఆదివారం (మూడో రోజు) : రూ. 8.2 కోట్లు
సోమవారం(నాలుగో రోజు) : రూ. 4.8 కోట్లు
మంగళవారం(ఐదోరోజు) : రూ. 4.1 కోట్లు
బుధవారం (ఆరోరోజు) : రూ. 3.9 కోట్లు
గురువారం (ఏడో రోజు) : రూ. 3.2 కోట్లు
టోటల్ గా మొదటి వారం కలెక్షన్లు దాదాపుగా రూ. 50.7 కోట్లు


Click it and Unblock the Notifications











