షాకిచ్చిన 'పంజా' హైదరాబాద్ రైట్స్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా డిసెంబర్ తొమ్మిదవ తేదిన విడుదల కానున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం హైదరాబాద్ రైట్స్ ని శ్రీ మీడియా వారు తీసుకున్నారు.గతంలో జై చిరంజీవ,చిరుత,దేశముదురు,రాఖీ,సైనికులు వంటి భారీ చిత్రాలును డిస్ట్రిబ్యూట్ చేసిన వీరు ఈ చిత్రాన్ని షాకిచ్చే ఎమౌంట్ పే చేసి తీసుకున్నారు.పధ్నాలుగు కోట్ల రూపాయలు చెల్లించి ఈ రైట్స్ ని సొంతం చేసుకున్నారు.దిల్ రాజు ఈ రైట్స్ ని తూసుకుందామనుకున్నా ఇంత పోటీలో ఎందుకుని తప్పుకున్నట్లు సమాచారం.ఇక పవన్ కళ్యాణ్ చిత్రాలు ప్లాఫ్ అయితేనే ఓ రేంజి కలెక్షన్స్ వస్తూంటాయి.అలాంటిది హిట్ అయితే అస్సలు కలెక్షన్స్ గురించి చెప్పే అక్కర్లేదనే కాన్సెప్టుతో ఈ రేటుని వారు చెల్లించినట్లు తెలుస్తోంది.
కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది.ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది.ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది.స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి.యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్.ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











