'ఊసరవెల్లి'ని క్రాస్ చేయలేకపోయిన 'పంజా'
పవన్ కళ్యాణ్ పంజా చిత్రం కలెక్షన్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ చిత్రం కలెక్షన్స్ ని దూకుడు,ఊసరవెల్లితో పోల్చి చూస్తున్నారు. పంజా కలెక్షన్స్ మొదటి రోజు 5.8 కోట్లు వచ్చాయని సమాచారం. అయితే దూకుడు కలెక్షన్స్ 5.73 కోట్లు. దాంతో దూకుడు కలెక్షన్స్ ని మొదటి రోజు దాటినట్లే. ఇక ఊసరవెల్లి మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం 7.3 కోట్లు. దాంతో పంజా ఓపినింగ్స్ మాత్రం ఊసరవెల్లిని దాటనట్లే అయ్యింది. పంజా చిత్రం పవన్ స్టామినాతో మొదటి రోజు విపరీతంగా కలెక్టు చేసింది. దానికితోడు లెక్కకు మించిన ధియోటర్స్,షోలు ఈ చిత్రాన్ని ఒకే రోజు ఎక్కువ మంది చూసేలా చేసింది. ఎన్ని చేసినా బి, సి సెంటర్లలో పవన్ కళ్యాణ్ తో సమానంగా ఎన్టీఆర్ కు కూడా ఓపినింగ్స్ ఉండటంతో దాన్ని దాటలేకపోయింది.
ఇక పంజా చిత్రం మార్నింగ్ షో నుంచే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా శని,ఆదివారాలు మాత్రం కలెక్షన్స్ కొద్దిగా కూడా సడలలేదు. దానికి తోడు చాలా చోట్ల వారం పాటు ఈ చిత్రం ప్రదర్శించే ధియోటర్స్ బుక్కింగ్ బుక్కైపోవటం కూడా కలిసివచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ మాఫియా వ్యక్తిగా చేసిన ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు విష్ణు వర్దన్ రూపొందించారు. పూర్తి స్దాయి స్టైలిష్ చిత్రంగా పేరు తెచ్చుకున్నా పవన్ అభిమానులు ఆశించే అంశాలు సినిమాలో లేకపోవటం సినిమాకు మైనస్ గా మారింది. అలాగే నైజాం ఏరియాలో పంజా అనుకున్నంతగా సినిమా వర్కవుట్ కాలేదు.


Click it and Unblock the Notifications











