'పంజా' నైజాం రైట్స్ రేటెంత అంటే
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా డిసెంబర్ తొమ్మిదిన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నైజాం రైట్స్ ని దాసరికి చెందిన సిరి మీడియా తీసుకుని విడుదల చేస్తోంది. దాదాపు 14 కోట్లు రూపాయలు ఈ రైట్స్ కోసం చెల్లించినట్లు సమాచారం.ఇక ఈ చిత్రాన్ని హైదరాబాద్ లోనే దాదాపు అరవై కి పైగా ధియోటర్స్ లో విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇన్ని ధియోటర్స్ లో విడుదల చేయటం రికార్డు అంటున్నారు. నైజాంలో రెండు వందలకు పైగా స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదల అయిన ఆడియో జనాదారణ పొందింది.
ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు కొత్తమ్మాయిలు మాజీ మిస్ ఇండియా సారా జేన్ డయాస్, ముంబై మోడల్ అంజలీ లావణియా కనిపించబోతున్నారు. దీనికి తోడు దర్శకుడు విష్ణు వర్ధన్ తమిళంలో చేసిన చిత్రాలు అన్నీ మంచి స్టైలిష్ ఎంటర్టైనర్స్ గా పేరు తెచ్చుకున్నాయి. ఈ చిత్రం కూడా ఆ రేంజిలో ఉండి పవన్ కెరీర్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అలాగే పవన్ కూడా గడ్డంతో ఈ సినిమాలో డాన్ గా కొత్తగా కనిపించి ఆసక్తి రేపుతున్నాడు.


Click it and Unblock the Notifications











