మహేష్ బిజినెస్‌ను దెబ్బతీస్తున్న పవన్
మహేష్ బాబు తాజా చిత్రం ది బిజినెస్ మ్యాన్ జనవరి 11 న విడుదలకు రంగం సిద్దం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బిజినెస్ అప్పుడే ప్రారంభమైంది. అయితే రీసెంట్ గా భారీ రేట్లతో కొన్న పంజా చిత్రం ఎగ్జిబిటర్స్ కు నష్టాలు తేవటంతో ఆ ఎఫెక్టు మహేష్ చిత్రంపై పడబోతోందని ట్రేడ్ లో వినపడుతోంది. దూకుడు పెద్ద హిట్టైందని చెప్పి ది బిజినెస్ మ్యాన్ ని ఓ రేంజి రేట్లతో నిర్మాతలు అమ్మకానికి పెట్టారు. అంతేగాక వారు గతంలో పూరీ,మహేష్ ల కాంబినేషన్ పోకిరి సూపర్ హిట్ ను కూడా చూపి ఈ చిత్రం రేట్లు భారీగా చెప్తున్నట్లు వినికిడి. మామూలుగా అయితే కొనటానకి వచ్చే డిస్ట్రిబ్యూటర్స్ ఇంత రేటు పెట్టి కొన్న చిత్రం ఒక వేళ అటూ ఇటూ అయితే పంజా పరిస్ధితినే ఎదుర్కోవాలా అనే డైలమోలో పడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ది బిజినెస్ మ్యాన్ చిత్రం మాత్రం చాలా బాగా వచ్చిందని పరిశ్రమలో టాక్ ఉంది. దాంతో అటూ ఇటూ ఊగిసలాటలో ఉన్నారు. నిర్మాతలు ఆర్.ఆర్ మూవీ మేకర్స్ వారు మాత్రం ఇవేమీ పరిగణలోకి తీసుకోకుండా తాము మంచి ప్రొజెక్టు చేసాం..గ్యారెంటీగా సూపర్ హిట్ కొట్టబోతున్నాం అనే ధీమాలో ఉన్నారు. అంతేకాక వారు కొన్ని ఏరియాల్లో తమ చిత్రాన్ని స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ సరసన కాజల్ తొలిసారిగా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రమోషన్ నిమిత్తం విడుదల చేసిన ప్రోమోలు,ఫస్ట్ లుక్ పోస్టర్స్ అంతటా క్రేజ్ క్రియోట్ చేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











