షాకిస్తున్న 'పంజా' బిజెనెస్...డిటేల్స్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా బిజెనెస్ ఓ రేంజిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 9 న విడుదల కానున్న ఈ చిత్రం బిజెనెస్ ఇప్పటివరకూ తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా చేయని బిజెనెస్ చేస్తోందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి ఫస్ట్ లుక్ విడుదల అయ్యేవరకూ అస్సలు బిజెనెస్ ఎంక్వైరీలు జరగలేదు.కానీ ఫస్ట్ లుక్ ,టీజర్ విడుదల అయ్యాక వస్తున్న ట్రేడ్ ఎంక్వైరీలు నిర్మాతలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు చెప్తున్నారు. ట్రేడ్ ఎంక్వైరీలు బట్టి తెలిసిన వివరాల్లోకి వెళితే..
సీడెడ్ - 8 కోట్లు
వైజాగ్ - 3.40 కోట్లు (ప్రింట్స్ లేకుండా),
వెస్ట్ గోదావరి - 2.40 కోట్లు,
కృష్ణా -2.40 కోట్లు,
గుంటూరు- 2.80 కోట్లు (ప్రింట్స్ లేకుండా)
నైజాం - దిల్ రాజు ఆఫర్ 14 కోట్లు (ఎన్ ఆర్ ఐ పద్దతి)
ఆడియో రైట్స్ - 60 లక్షలు
ఇక తమ పంజా చిత్రంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణు వర్ధన్ అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం పంజా చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ...ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్‌కళ్యాణ్ పాత్ర చిత్రణ ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది అన్నారు. కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు: అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్: అనూవర్థన్.


Click it and Unblock the Notifications











