Paradha Movie Collections: అనుపమా పరమేశ్వరన్ కు భారీ షాక్.. 2 రోజుల్లో పరదా మూవీ కలెక్షన్లు ఎంతంటే?
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ తాజాగా నటించిన చిత్రం పరదా. ఈ చిత్రానికి భాగ్యలక్ష్మి పోస సమర్పణలో ఆనంద మీడియా బ్యానర్ లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. నిర్మాతలుగా శ్రీనివాసులు పీజీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ వ్యవహరించారు. సినిమా బండి, శుభం వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల పరదా సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. ఆగస్టు 22న ఈ చిత్రం తెలుగు, మలయాళంలో విడులైంది. ఈ క్రమంలో పరదా మూవీ బడ్జెట్ ఎంత? 2 రోజుల్లో ఈ చిత్రానికి అందిన వసూళ్లు ఎంతనే విషయానికొస్తే..
పరదా సినిమా బడ్జెట్?
ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, ప్రధాన పాత్రల్లో నటించారు. సీనియర్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పనిచేశారు. దీంతో నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలకు అయిన వ్యయమంతా కలుపుకొని సినిమాకు రూ.8 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

పరదా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్?
అనుపమా పరమేశ్వరన్ చిత్రాలకు ప్రేక్షకుల్లో కాస్తా గుర్తింపు ఉండటం విశేషం. కొంత కాలంగా అనుపమా విమెన్ సెంట్రిక్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. దీంతో పరదా సినిమాపై కాస్తా అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో తెలుగు స్టేట్స్, కేరళలో థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఈ చిత్రం రూ.5 కోట్ల బిజినెస్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
బ్రేక్ ఈవెన్ పాయింట్..?
పరదా చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా రూ.5 కోట్లు వ్యాపారం జరగడంతో, ఇక 5 కోట్ల రూపాయల షేర్, 10 కోట్ల రూపాయల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా సాధించాలని ట్రేడ్ నిపుణులు విలువ కట్టారు. రూ.10 కోట్లు గ్రాస్ వసూలైతేనే ఈ చిత్రం లాభాల్లోకి రానుంది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వసూళ్లు ఆశాజనకంగా లేకపోవం గమనార్హం.
పరదా చిత్రం 2రోజుల వసూళ్లు?
2 రోజుల్లో పరదా చిత్రానికి అందించిన వసూళ్లు షాకింగ్ గా ఉన్నాయి. తెలుగు వెర్షన్, మలయాళం వెర్షన్ లో రెండూ కలుపుకొని ఈ సినిమాకు కేవలం 50 లక్షల గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. డే1 న రూ.12 లక్షలు, 2వ రోజు రూ.14 లక్షల వసూళ్లు అందాయని తెలుపుతున్నారు. ఇలా రెండ్రోజుల్లో రూ.26 లక్షల నెట్, రూ.50 లక్షల వరకు గ్రాస్ వసూల్ చేసిందని వెల్లడిస్తున్నారు. ఇక 3వ రోజు కాస్తా మెరుగ్గా కలెక్షన్లు అందే అవకాశం ఉందని అంటున్నారు. ఒకవేళ మిస్ అయితే ఒక సోమవారం నుంచి బాక్సాఫీస్ వద్ద పరదా చిత్రం పక్కకు వెళ్లిపోతుందని అభిప్రాయపడుతున్నారు. చిత్రానికి తొలిరోజు కాస్తా నెగెటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ పై ప్రభావం చూపిస్తోందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు. మున్ముందు బ్రేక్ ఈవెన్ టార్గెట్ నైనా పూర్తి చేస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











