Param Sundari 4 days Box Office: 50 కోట్ల జాన్వీ కపూర్ మూవీ.. పరమ్ సుందరి మూవీకి 4 బాక్సాఫీస్ రిపోర్ట్

బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరి పరమ్ సుందరి. యువ దర్శకుడు తుషార్ జలోటా డైరెక్షన్‌లో హిందీ సినిమా రంగంలోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన సినిమా ఆగస్టు 29వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ సంజయ్ కపూర్, రెంజీ పనికర్, సిద్దార్థ్ శంకర్, మనోజ్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఇనాయత్ వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

కేరళ నేటివిటీ ఆధారంగా సౌత్, నార్త్ ఇండియా కల్చర్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు సంతాన కృష్ణన్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫిని అందించి.. మలయాళ ప్రాంత అందాలను పెయింటింగ్‌లా అందించారు. ఇక సచిన్ జిగర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. సోను నిగమ్ పాడిన పాట ఈ చిత్రానికి అదనపు బలంగా మారింది.

Param Sundari Movie 4 days Box Office

పరమ్ సుందరి సినిమాను భారీ బడ్జెట్‌‌తో అంటే.. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 3000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. తొలివారాంతంలో దాదాపు 8000 షోలు ప్రదర్శించినట్టు సమాచారం.

పరమ్ సుందరి చిత్రం రిలీజ్ తర్వాత మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తొలి రోజున 7.25 కోట్లు, రెండో రోజున 10కోట్ల రూపాయలు, మూడో రోజున 11 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సాక్ నిక్ వెల్లడించింది. దాంతో ఈ సినిమా ఇండియాలో సుమారుగా 28 కోట్ల రూపాయల నెట్ వసూళ్ల, 33 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను నమోదు చేసింది.

జాన్వీ కపూర్ నటించిన ఈ సినిమా ఓవర్సీస్‌లో కూడా భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ చిత్రం తొలి రోజున అమెరికాలో 165K డాలర్లు, యూకేలో 40K డాలర్లు, ఆస్ట్రేలియాలో 35K డాలర్లు, న్యూజిలాండ్‌లో 10K డాలర్లు, ఇతర దేశాల్లో 200K డాలర్లు వసూలు చేసింది. అయితే 3 రోజుల తర్వాత ఈ చిత్రం 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లను రాబట్టింది అంటే.. సుమారుగా 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 33 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 18 కోట్ల రూపాయలు కలిపి మొత్తంగా 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక చిత్రం 4వ రోజున 3 నుంచి 4 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్‌గా రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 60 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రం ఏ మేరకు లాభాలను రాబడుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X