Param Sundari Box Office: జాన్వీ కపూర్ బాక్సాఫీస్ మాయజాలం.. పరమ్ సుందరికి ఎన్ని కోట్లంటే?
బాలీవుడ్ స్టార్స్ సిద్దార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరి పరమ్ సుందరి. యువ దర్శకుడు తుషార్ జలోటా డైరెక్షన్‌లో హిందీ సినిమా రంగంలోని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మడోక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మించిన సినిమా ఆగస్టు 29వ తేదీన గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ సంజయ్ కపూర్, రెంజీ పనికర్, సిద్దార్థ్ శంకర్, మనోజ్ సింగ్, అభిషేక్ బెనర్జీ, ఇనాయత్ వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..
కేరళ నేటివిటీ ఆధారంగా సౌత్, నార్త్ ఇండియా కల్చర్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందిన ఈ సినిమాకు సంతాన కృష్ణన్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫిని అందించి.. మలయాళ ప్రాంత అందాలను పెయింటింగ్‌లా అందించారు. ఇక సచిన్ జిగర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్‌గా మారింది. సోను నిగమ్ పాడిన పాట ఈ చిత్రానికి అదనపు బలంగా మారింది. ఈ సినిమా భారీ బడ్జెట్ అంటే.. ఆర్టిస్టులు, టెక్నిషియన్స్, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 60 కోట్ల రూపాయలతో నిర్మించారు.

జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రం ఇటీవల కాలంలో యువ హీరో, హీరోయిన్ల సినిమా అత్యధికంగా వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో నిలిచింది. ఈ చిత్రం ఇండియా వైడ్‌గా సుమారుగా 7.5 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ సినిమా 1.5 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసింది.
అయితే రెండో రోజు పరమ్ సుందరి సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం సుమారుగా తొలి రోజు కలెక్షన్ల కంటే 3 శాతం వసూళ్లు అధికంగా సాధించవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ఇండియా వైడ్‌గా 8 కోట్ల రూపాయలు, వరల్డ్ వైడ్‌గా 1 కోటి రూపాయలకుపైగా కలెక్షన్లను రాబట్టే అవకాశం ఉంది. దాతో ఈసినిమా రెండో రోజుల్లో సుమారుగా 20 కోట్ల గ్రాస్ రూపాయలు వసూలుచేసే ఛాన్స్ కనిపిస్తున్నది.
ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 40 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. అంటే సుమారుగా 75 నుంచి 80 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో ఈ సినిమా ఏ మేరకు బ్రేక్ ఈవెన్ అవుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











