బాలకృష్ణ పరమ వీర చక్ర చిత్రం గుంటూరు రైట్స్ రికార్డు
బాలకృష్ణ "పరమ వీర చక్ర" చిత్రం గుంటూర్ రైట్స్ రికార్డు రేటుకి అమ్ముడుపోయినట్లు సమాచారం. రెండు కోట్ల మూడు లక్షలకు ఈ చిత్రం హక్కులని తీసుకున్నారు. బాలకృష్ణ గత చిత్రం సింహా ..అన్ని ఏరియాలో రికార్డు స్ధాయిలో కలెక్షన్స్ వర్షం కురిపించటమే ఈ క్రేజ్ రావటానికి కారణం అంటున్నారు. అలాగే దాసరి 150 చిత్రం కావటం కూడా ఈ చిత్రం పై అంచనాలు విపరీతంగా పెరగటానికి కారణం అంటున్నారు. జనవరి 12 వ తేదీన విడుదల అయ్యే ఈ చిత్రంలో నేహాధూపియా, అమీషా ప టేల్, షీలా హీరోయిన్స్ గా చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ ఈ చిత్రంలో ఆర్మీ మేజర్ గానీ, సినీ స్టార్ గానూ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.
మరో ప్రక్క సూపర్ హిట్ రోబో ప్యారడీని బ్రహ్మానందం, ఆలీ, హేమలపై చిత్రీకరించారు. అలాగే ఈ చిత్రం ఆడియో ఈ నెల 29న ఆదిత్య ఆడియో సంస్థ ద్వారా విడుదల కానుంది.తెలుగు చిత్ర పరిశ్రమ అతిరథులు, నందమూరి వంశాభిమానుల సమక్షంలో శిల్ప కళావేదికలో భారీ ఎత్తున ఆడియో ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు. అలాగే కొమరమ్ భీమ్ గెటప్‌లో వచ్చే గీతం ఉద్వేగభరితంగా ఉంటుంది. దేశ సరిహద్దుల్లో చిత్రించిన ఫైటింగ్ సీన్స్ చిత్రానికి బలాన్నిస్తాయన్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అమిషా పటేల్, షీలా, నేహా ధూపియా కథానాయికలు. కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, మురళీమోహన్, విజయకుమార్, ఆలీ, హేమ, సుధ ఈ చిత్రంలో మిగతా పాత్రల్లో కనపించనున్నారు.


Click it and Unblock the Notifications











