Parasakthi Day 1 Collection: షాకింగ్‌గా పరాశక్తి ఫస్ట్ డే కలెక్షన్స్... శివకార్తీకేయన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

మదరాసి లాంటి డిజాస్టర్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్ నటించిన తాజా చిత్రం పరాశక్తి. సుధా కొంగర ఈ సినిమాకు దర్శకత్వం వహంచారు. శివకార్తీకేయన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న పరాశక్తి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పరాశక్తి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు పరాశక్తి ఎన్ని కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...

పరాశక్తి తారాగణం
డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ పరాశక్తి సినిమాను నిర్మించారు. రవి మోహన్, అథర్వ, ప్రకాష్ బెల్వాడీ, కులప్పుల్లి లీల, దేవ్ రామ్‌నాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, చేతన్, పాప్రి ఘోష్‌‌లు కీలకపాత్రలు పోషించగా... రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్‌లు గెస్ట్ రోల్‌లో నటించారు. రవి కే చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా... సతీష్ సూర్య ఎడిటర్‌గా పనిచేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Parasakthi Day 1 Expected Box Office Collections Worldwide Sivakarthikeyan s film starting low opening

పరాశక్తి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పరాశక్తి మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. 1960ల నాటి తమిళనాడు సమాజం, అప్పటి పరిస్ధితులను ప్రతిబింబిచేలా భారీ సెట్స్‌ వేయడంతో పాటు ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. చెన్నై, చిదంబరం, కరైకుడి, మధురై, కొలంబో, పొలాచ్చిలలో పరాశక్తి సినిమా చిత్రీకరణ జరుపుకుంది. శివకార్తీకేయన్ క్రేజ్‌కు తోడు ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదాల నేపథ్యంలో పరాశక్తికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.

పరాశక్తి బ్రేక్‌ఈవెన్ టార్గెట్ ఎంత?
పరాశక్తి ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్‌ దాదాపు 100 కోట్లకు పైగా బిజినెస్ చేసి నాన్ థియేట్రికల్ పరంగా మంచి లాభాలు అందుకుంది. ఇక థియేట్రికల్ విషయానికి వస్తే... తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 40 కోట్ల రూపాయల, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 29 కోట్ల రూపాయలు చొప్పున 90 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. దాంతో శివకార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

పరాశక్తి తొలిరోజు వసూళ్లు
200 కోట్ల రూపాయల బ్రేక్‌ఈవెన్ టార్గెట్‌తో జర్నీ మొదలుపెట్టిన పరాశక్తి మూవీకి మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. దాంతో డల్‌గా తన బాక్సాఫీస్ పరుగును ప్రారంభించాడు శివకార్తీకేయన్. తొలిరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు శివకార్తీకేయన్ మూవీకి 45.71 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. ఇప్పటి వరకు చెన్నైలో 829 షోలు, కోయంబత్తూరులో 262 షోలు, బెంగళూరులో 348 షోలు, మధురైలో 82 షోలు ప్రదర్శితమైనట్లు సాక్‌నిక్ తెలిపింది. కడపటి సమాచారం అందేసరికి పరాశక్తి మూవీకి ఇండియాలో 3.35 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా సాక్‌నిక్ నివేదించింది. ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి పరాశక్తి మూవీకి తొలిరోజు ఇండియాలో 10 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

పరాశక్తి ఓపెనింగ్స్
ఇక పరాశక్తి ఓవర్సీస్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. యూఎస్ఏలో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్‌లో 133 సెంటర్స్‌లో 241 షోలకు గాను 5268 టికెట్స్ అమ్ముడయ్యాయి. తద్వారా ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్‌ కింద అమెరికాలో 75,626 డాలర్లు (భారత కరెన్సీలో 68.26 లక్షల రూపాయలు) వసూలు చేసింది. ఇక నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ కింద శివకార్తీకేయన్ మూవీకి 80k డాలర్లు ( 72.21లక్షల రూపాయలు) రాబడుతుందని అంచనా వేస్తున్నారు. ఓవర్సీస్ కలెక్షన్స్‌తో కలిపి పరాశక్తి మూవీ తొలి రోజు 12 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X