Parasakthi Day 2 Collection: దారుణంగా పరాశక్తి కలెక్షన్స్... నెగిటివ్ టాక్‌లో శివకార్తీకేయన్ మూవీకి ఎంతంటే?

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తీకేయన్‌గా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ పరాశక్తి. 1960లలో తమిళనాడులో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం, తదితర సంఘటనల ఆధారంగా పరాశక్తి సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో శివకార్తీకేయన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న పరాశక్తి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో పరాశక్తి బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు పరాశక్తి ఎన్ని కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే...

పరాశక్తి తారాగణం
డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాష్ భాస్కరన్ పరాశక్తి సినిమాను నిర్మించారు. రవి మోహన్, అథర్వ, ప్రకాష్ బెల్వాడీ, కులప్పుల్లి లీల, దేవ్ రామ్‌నాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, చేతన్, పాప్రి ఘోష్‌‌లు కీలకపాత్రలు పోషించగా... రానా దగ్గుబాటి, బాసిల్ జోసెఫ్‌లు గెస్ట్ రోల్‌లో నటించారు. రవి కే చంద్రన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా... సతీష్ సూర్య ఎడిటర్‌గా పనిచేశారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

Parasakthi Day 2 Expected Box Office Collections Worldwide Sivakarthikeyan s film witnessed a steep decline

పరాశక్తి బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి పరాశక్తి మూవీకి దాదాపు 150 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. పరాశక్తికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ఈ మూవీకి ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్‌ దాదాపు 100 కోట్లకు పైగా బిజినెస్ చేసి నాన్ థియేట్రికల్ పరంగా మంచి లాభాలు అందుకుంది. ఇక థియేట్రికల్ విషయానికి వస్తే... తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 40 కోట్ల రూపాయల, ఇతర రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 20 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ 29 కోట్ల రూపాయలు చొప్పున 90 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. దాంతో శివకార్తీకేయన్ మూవీ లాభాల్లోకి రావాలంటే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు వాల్యూ నిర్దేశించారు.

పరాశక్తి తొలిరోజు వసూళ్లు
పరాశక్తి మూవీ నెగిటివ్ టాక్‌లోనూ తొలిరోజు మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. శివకార్తీకేయన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది తక్కువగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ స్థాయి ఓపెనింగ్స్ ఫర్వాలేదని అంటున్నారు. పరాశక్తికి ఇండియాలో తొలిరోజున 12.35 కోట్ల రూపాయల నెట్... 14.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కర్ణాటకలో 2 కోట్ల రూపాయలు, ఏపీ తెలంగాణలలో 10 లక్షల రూపాయలు, తమిళనాడులో 12 కోట్ల రూపాయలు, కేరళలో 4 లక్షల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 29 లక్షల రూపాయల కలెక్షన్స్ వసూలు చేసింది పరాశక్తి.

పరాశక్తి ఓవర్సీస్ కలెక్షన్స్
పరాశక్తి మూవీకి ఓవర్సీస్‌లో మాత్రం మంచి వసూళ్లను రాబట్టింది. నార్త్ అమెరికాలో ప్రీమియర్స్+ డే 1 అడ్వాన్స్ సేల్స్‌లో 325k డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 3 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక యూరప్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలలో మరో 7 కోట్ల రూపాయలు రాబట్టాడు శివకార్తీకేయన్. దాంతో ఓవర్సీస్‌లో తొలిరోజు పరాశక్తి సినిమాకు 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్ కలెక్షన్స్ కలిపి శివకార్తీకేయన్ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 24.7 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి.

పరాశక్తి రెండో రోజు కలెక్షన్స్
వీకెండ్ అయినప్పటికీ పరాశక్తికి రెండో రోజు అంతంత మాత్రంగానే బుకింగ్స్ జరుగుతున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రభాస్ నటించిన రాజా సాబ్‌ నుంచి పరాశక్తికి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు శివకార్తీకేయన్ మూవీకి 35.15 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లు సాక్‌నిక్ నివేదించింది. కడపటి వార్తలు అందేసరికి పరాశక్తి మూవీకి రెండో రోజు ఇండియాలో 2.52 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్స్ వచ్చాయి.

ఆదివారం శివకార్తీకేయన్ మూవీకి ఇండియాలో 8 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 5 కోట్ల రూపాయల చొప్పున కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దాంతో రెండో రోజు వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు 15 కోట్ల రూపాయల రేంజ్‌లో గ్రాస్ రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. తద్వారా రెండ్రోజుల్లో పరాశక్తి మూవీకి ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వస్తాయని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X