Parasakthi Business: పరాశక్తికి రికార్డు బిజినెస్.. శివకార్తీకేయన్ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లంటే?

తమిళ స్టార్ హీరో శివకార్తీకేయన్, సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం పరాశక్తి. ఇండియన్ పొలిటికల్ హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రరానికి సుధా కొంగర దర్శకత్వం వహించారు. డాన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆకాశ్ భాస్కరన్ నిర్మించిన ఈ చిత్రానికి మథిమారన్ పుగజేంది కథను అందించారు. తమిళనాడులో 60వ దశకంలో సాగిన హిందీ వ్యతిరేకోద్యమం నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రంలో రవి మోహన్, అథర్వ, కులప్పులి లీల, దేవ్ రమానాథ్, పృథ్వీ రాజన్, గురు సోమసుందరం, బాసిల్ జోసెఫ్, షాజీ చెన్, పాప్రి ఘోష్ తదితరులు నటించారు.

ఈ చిత్రానికి రవీ కే చంద్రన్ సినిమాటోగ్రఫిని, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, సతీష్ సూర్య ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం 2026 సంవత్సరం జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? థియేట్రికల్ ట్రేడ్ ఎంత జరిగింది? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Parasakthi Pre Release Business Worldwide

తమిళనాడు రాజకీయాలను అనూహ్యంగా ప్రభావితం చేసిన హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం నేపథ్యంగా ఈ సినిమాను పిరియాడిక్ మోడ్‌లో దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కించారు. ఈ సినిమాలో భారీ తారాగణం, అప్పటి వాతావరణం ప్రతిబించేలా సెట్లు, దుస్తులు, ఇతర అంశాల కారణంగా భారీ బడ్జెట్ అయింది. నటీనటులు, సాంకేతిక విభాగాల నిపుణులు, ప్రొడక్షన్, ప్రమోషనల్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

పరాశక్తి సినిమాపై క్రేజ్ పెరగడం, వివాదాలు ఈ సినిమా చుట్టూ తిరగడంతో అంచనాలు, క్యూరియాసిటీ కూడా పెరిగాయి. దాంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ ఘనంగా జరిగింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను 52 కోట్ల రూపాయల ఫ్యాన్సీ రేటును చెల్లించి జీ5 సొంతం చేసుకొన్నది. ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను 32 కోట్ల రూపాయలకు కలైంగ్నర్ టెలివిజన్ దక్కించుకొన్నది. ఇక ఆడియో రైట్స్ కూడా భారీ రేటుకు అంటే సుమారుగా 15 కోట్ల రూపాయలకు సారేగామ చేజిక్కించుకొన్నది అని ట్రేడ్ రిపోర్ట్.

ఇక ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా తమిళనాడులో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. శివకార్తీకేయన్ కెరీర్‌లో అత్యధికంగా బిజినెస్ జరిగింది. ఈ సినిమా తమిళ థియేట్రికల్ రైట్స్‌ను రెడ్‌జెయింట్ సంస్థ 40 కోట్ల రూపాయలకు దక్కించుకొన్నది. ఇక ఇతర రాష్ట్రాల హక్కులు 20 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఓవర్సీస్ రైట్స్ రికార్డు స్థాయిలో 29 కోట్ల రూపాయలకు డీల్ క్లోజ్ అయింది అని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

పరాశక్తి సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా 90 కోట్ల రూపాయలు, నాన్ థియేట్రికల్ బిజినెస్ 100 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తంగా 190 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా థియేట్రికల్‌గా లాభాల్లోకి రావాలంటే.. వరల్డ్ వైడ్‌గా సుమారుగా 200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ భారీగానే ఉంది. రానున్న రోజుల్లో ఏ రేంజ్‌లో బాక్సాఫీస్ వద్ద సంచలనం రేపుతుందో వేచి చూడాల్సిందే అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X