Pathaan 20 days collections ఓ వైపు 1000 కోట్లు.. మరోవైపు 500 కోట్లు.. చరిత్రకు అడుగు దూరంలో పఠాన్!
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం చరిత్ర సృష్టించేందుకు ఒక్క అడుగు దూరంలో ఉంది. హిందీ సినిమా చరిత్రలో మైలురాళ్లుగా నిలిచే రెండు రికార్డులకు చేరువైంది. యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో అనేక రికార్డులను తిరగరాస్తూ మూడో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద విజృంభిస్తున్నది. దీపిక పదుకోన్, జాన్ అబ్రహం నటించిన పఠాన్ చిత్రం 20 రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

RRR, కేజీఎఫ్2 రికార్డులు మటాష్
పఠాన్ చిత్రం ఇండియాలో రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నది. కేజీఎఫ్2, RRR, దంగల్, టైగర్ జిందా హై కలెక్షన్ల రికార్డులు పఠాన్‌కు దాసోహం అన్నాయి. తొలివారం 364 కోట్లు రాబట్టిన ఈ చిత్రం రెండో వారం కూడా అదే ఊపును కొనసాగించింది. రెండో వారంలో 95 కోట్లు ఇండియాలో రాబట్టింది. దాంతో ఈ చిత్రం సుమారు 450 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

రెండు వారాల్లో పఠాన్ కలెక్షన్లు
పఠాన్ చిత్రం హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లకు మంచి రెస్పాన్స్ లభించింది. తొలివారం హిందీ వెర్షన్ 350 కోట్లకుపైగా, తెలుగు 10 కోట్లు, తమిళం 4.5 కోట్లు రాబట్టింది. ఇక రెండోవారంలో హిందీ వెర్షన్ 91.5 కోట్లు, తెలుగు 2 కోట్లకుపైగా, తమిళంలో 1.5 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం హిందీలో 440 కోట్లు, తెలుగులో 12 కోట్లు, తమిళంలో 6 కోట్ల రూపాయల మేర కలెక్షన్లు రాబట్టింది.

పఠాన్ మూడో వారంలో
పఠాన్ చిత్రం మూడో వారం విషయానికి వస్తే.. తొలి రోజు 6 కోట్లు, రెండో రోజు 11 కోట్లు, మూడో రోజు 13 కోట్లు, నాలుగో రోజు 4.5 కోట్లు, ఐదో రోజు 4.5 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 495 కోట్ల మేర వసూళ్లను సాధించింది. అయితే ఆరో రోజు ఈ సినిమా 5.5 కోట్ల రూపాయలు రాబట్ట వచ్చనే అంచనాకు ట్రేడ్ వర్గాలు వచ్చాయి. దాంతో ఈ సినిమా 21వ రోజు 500 కోట్ల అరుదైన క్లబ్‌లో పఠాన్ చేరేందుకు రంగం సిద్దమైంది.

20 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా
రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన పఠాన్ చిత్రం దుమ్మురేపే కలెక్షన్లతో దూసుకెళ్లింది. గత 20 రోజుల్లో ఇండియాలో 587 కోట్ల గ్రాస్, 494 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 360 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 945 కోట్లకుపైగా కలెక్షన్ల సాధించింది.

500 కోట్లు, 1000 కోట్లకు చేరువగా
పఠాన్ చిత్రం బాక్సాఫీస్ జర్నీలో 21వ రోజు అరుదైన రికార్డుకు చేరువ కానున్నది. ఈ సినిమా 500 కోట్ల మార్కును చేరే అవకాశం కనిపిస్తున్నది. దాంతో పఠాన్ చిత్రం మరో ఘనతను సాధించేందుకు కూడా చేరువైంది. భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి2, కేజీఎఫ్2 తర్వాత 1000 కోట్లు సాధించిన మూడో చిత్రంగా చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉంది.


Click it and Unblock the Notifications











