Pathaan Closing Collections పఠాన్‌కు లాభాల పంట.. షారుక్‌కు ఎన్ని వందల కోట్ల రెమ్యునరేషన్ అంటే?

బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగించింది. దీపిక పదుకోన్, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం రిలీజైన తొలి ఆట నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్లింది. విడుదలైన అన్నీ భాషల్లో కూడా వసూళ్ల సునామీని సృష్టించింది. దాంతో రికార్డు కలెక్షన్లు నమోదయ్యాయి. ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్ల వివరాలు, షారుక్ ఖాన్‌కు ఎన్ని కోట్లు రెమ్యునరేషన్‌గా వచ్చాయనే వివరాల్లోకి వెళితే..

80 రోజులపాటు థియేట్రికల్ రన్:షారుక్ ఖాన్‌కు తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో పఠాన్ చిత్రం రిలీజైంది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఇండియా వైడ్‌గా బాలీవుడ్ బాయ్‌కాట్ ట్రెండ్ చేశారు. దాంతో ఈ సినిమాను ప్రేక్షకుల ఆదరిస్తారా? లేదా అనే అనుమానాలు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య పఠాన్ మూవీ జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు 80 రోజుల పాటు థ్రియేట్రికల్ రన్‌ను కొనసాగించింది.

Pathaan Closing Collections Worldwide: Do You Know How much Shah Rukh Khan gets remuneration?

పఠాన్ బడ్జెట్ ఎంతంటే? :సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ చిత్రాన్ని దాదాపు 260 కోట్ల రూపాయలతో యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమా హిందీ వెర్షన్ బ్రేక్ ఈవెన్ 300 కోట్లుగా నిర్ణయించారు. అలాగే తమిళం, తెలుగు బ్రేక్ ఈవెన్ 15 కోట్లుగా నిర్ణయించారు. భారీ బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో పఠాన్ బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది.

ఇండియాలో ఎంత కలెక్ట్ చేసిందంటే? :పఠాన్ చిత్రం తొలివారం రికార్డు వసూళ్లను రాబట్టింది. తొలివారం ముగిసే సమయానికి ఇండియాలో హిందీ వెర్షన్ 351 కోట్ల గ్రాస్, తెలుగు 9 కోట్ల గ్రాస్, తమిళం 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రెండోవారంలో 95 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మూడో వారంలో 47 కోట్ల గ్రాస్, 4 వారంలో 15 కోట్ల గ్రాస్, ఐదో వారం 9 కోట్ల గ్రాస్, 6వ వారం 10 కోట్లు, 7 వారం 3 కోట్లు, 8వ వారం 2 కోట్లు, తొమ్మితో వారం 45 లక్షలు రాబట్టింది.

Pathaan Closing Collections Worldwide: Do You Know How much Shah Rukh Khan gets remuneration?

ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్లంటే? :ఇక పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో 545 కోట్లు గ్రాస్ షేర్, 657 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం 392 కోట్లు గ్రాస్, 178 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1050 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం భారీ లాభాలను డిస్ట్రిబ్యూటర్లకు పంచిపెట్టింది.

పఠాన్ డిజిటల్ రెవెన్యూ ఎంతంటే? :ఇక థియేట్రికల్ కలెక్షన్లను పక్కన పెడితే.. నాన్ థియేట్రికల్ రైట్స్‌కు భారీగా రేట్లు పలికాయి. పఠాన్ సినిమా శాటిలైట్, డిజిటల్ హక్కులు 150 కోట్లు సంపాదించి పెట్టాయి. ఇక మ్యూజిక్ రైట్స్, ఇతర బిజినెస్ వల్ల 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. దాంతో నాన్ థియేట్రికల్ సుమారు 180 కోట్లు రాబట్టింది.

Pathaan Closing Collections Worldwide: Do You Know How much Shah Rukh Khan gets remuneration?

షారుక్ ఖాన్‌కు ఎన్ని వందల కోట్లంటే? :ఇక షారుక్ ఖాన్‌ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోకుండా లాభాల్లో వాటాను ఎంచుకొన్నాడు. దాంతో ఈ సినిమాలో నటించినందుకు గాను.. ఆయన వాటాగా దాదాపు 200 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్‌గా ముట్టినట్టు సమాచారం. గత 5 సంవత్సరాల్లో దారుణమైన ఫ్లాప్‌లను చవిచూసిన షారుక్‌కు భారీ హిట్ ఖాతాలో పడటమే కాకుండా ఊహించిన ఆదాయం వచ్చింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X