Pathaan Advance Collections బాక్సాఫీస్ హిస్టరీకి షారుక్ రెడీ.. అక్కడ 100000 టికెట్లు అమ్మకం..

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం భారీ క్రేజ్‌ను క్రియేట్ చేస్తున్నది. షారుక్ ఖాన్ రేంజ్‌కు తగినట్టుగానే అడ్వాన్స్ బుకింగ్ నమోదు అవుతున్నది. గత కొన్ని సంవత్సరాలుగా వరుస ఫ్లాపులతో దాదాపు కనుమరుగైన షారుక్ ఖాన్ ఈ సినిమా ద్వారా తన స్టామినాను మరోసారి రుజువు చేసుకోవడానికి వస్తున్నారు. జనవరి 25 తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే?

4 ఏళ్ల తర్వాత షారుక్ సినిమా

4 ఏళ్ల తర్వాత షారుక్ సినిమా


సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత రిలీజ్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచించింది. ఆయన నటించిన పఠాన్ చిత్రంపై అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకొన్నారు. అయితే షారుక్ సినిమాకు రికార్డు అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దేశీయంగానే కాకుండా విదేశాల్లో ఊహించిన రెస్పాన్స్ లభిస్తున్నది.

దీపిక శృంగార భంగిమల వివాదం

దీపిక శృంగార భంగిమల వివాదం


పఠాన్ చిత్రానికి సంబంధించిన టీజర్లు, ట్రైల్లర్లు పాటలు హంగామా సృష్టించడమే కాకుండా వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాయి. బేషరమ్ రంగ్ పాటలోని దీపిక పదుకోన్ శృంగార భంగిమలు, దుస్తులపై సంప్రదాయవాదులు, హిందుత్వ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పఠాన్ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది.

హైదరాబాద్‌లో రికార్డు బుకింగ్

హైదరాబాద్‌లో రికార్డు బుకింగ్


హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 25వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి హైదరాబాద్‌లో భారీ స్పందన కనిపిస్తున్నది. తొలి రోజున ఈ సినిమా మొత్తం 280 షోలను ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు కోసం మొత్తం 1.22 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు అయ్యాయి.

పీవీఆర్ చైన్ థియేటర్లలో

పీవీఆర్ చైన్ థియేటర్లలో


ఇక దేశవ్యాప్తంగా పఠాన్ సినిమాకు సంబంధించి టికెట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పీవీఆర్ సినిమాస్‌కు సంబంధించిన చైన్ థియేటర్లలో రికార్డు స్థాయి అమ్మకాలు జరుగుతున్నాయి. ఢిల్లీ, హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో టికెట్లు హాట్ కేకుల్లా మారిపోయాయి. పీవీఆర్ చైన్ స్క్రీనల్లలో ఇప్పటికే 1 లక్ష టికెట్లు అమ్ముడయ్యాయంటే ఈ సినిమా క్రేజ్ అంటే ఏంటో తెలిసిపోతుంది.

 తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్

తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్


తెలుగు వెర్షన్ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 1.22 కోట్లు, విజయవాడలో 4.15 కోట్లు, వరంగల్‌లో 4.64 లక్షలు, గుంటూరులో 61.5 వేలు, నిజమాబాద్‌లో 70 వేలు, కాకినాడలో 45 వేలు వసూలు చేసింది. ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు 1.35 కోట్లు రాబట్టింది. ఇంకా పూర్తిస్థాయిలో ఆన్ లైన్ బుకింగ్స్ ఓపెన్ కావాల్సి ఉంది.

ఉత్తరాదిలో ఊహించని కలెక్షన్లు

ఉత్తరాదిలో ఊహించని కలెక్షన్లు


ఇక ఉత్తరాదిలో అడ్వాన్స్ కలెక్షన్ల విషయానికి వస్తే.. ముంబైలో అత్యధికంగా 1.59 కోట్లు, ఢిల్లీలో 1.52 కోట్లు, బెంగళూరులో 1.05 కోట్లు, కోల్ కతాలో 1.5 కోట్లు, పూణేలో 49 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇంకా భారీ వసూలు సాధించే అవకాశం ఉంది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల హంగామా

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల హంగామా


పఠాన్ సినిమాకు సంబంధించిన వివిధ భాషల టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ వివరాలు ఇలా ఉన్నాయి. హిదీ వెర్షన్ టికెట్ల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా 1.29 కోట్లు రాబట్టింది. తెలుగు వెర్షన్ విషయానికి వస్తే. 17 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారు 13.1 కోట్లు రాబట్టింది. రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులు ఉన్నందున ఈ సినిమా కనీసం అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే 20 కోట్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X