Pathaan day 2 Collections బాక్సాఫీస్‌పై షారుక్ దండయాత్ర.. కలెక్షన్లు సునామీ.. 300 కోట్లకు చేరువగా!

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తున్నది. 2023లో ఆరంభంలోనే భారీ రికార్డులను సెట్ చేస్తున్నది. ఇటీవల కాలంలో ఏ బాలీవుడ్ సినిమా రాబట్టని విధంగా కలెక్షన్ల సునామీని కురిపిస్తున్నది. ఇటీవల రికార్డు కలెక్షన్లు రాబట్టిన కేజీఎఫ్ 2, పొన్నియన్ సెల్వన్, RRR లాంటి సినిమాల కలెక్షన్లను రాబడుతున్నది. ప్రపంచవ్యాప్తంగా పఠాన్ సినిమా సృష్టిస్తున్న బాక్సాఫీస్ ప్రకంపనల వివరాల్లోకి వెళితే..

షారుక్, సల్మాన్ కాంబినేషన్

షారుక్, సల్మాన్ కాంబినేషన్

పఠాన్ సినిమా విషయానికి వస్తే.. దేశం కోసం పోరాడటమే కాకుండా ప్రాణాలకు తెగించే సీక్రెట్ ఏజెంట్ కథ. షారుక్ ఖాన్ ఫెర్ఫార్మెన్స్, దీపిక పదుకోన్ గ్లామర్, జాన్ అబ్రహం విలనిజం, సల్మాన్ ఖాన్ స్పెషల్ ఎంట్రీ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయి. సాంకేతిక విలువలు హై స్టాండర్డ్‌లో ఉన్నాయి. దాంతో ఈ సినిమాకు భారీ ఆదరణ దక్కుతున్నది.

 రికార్డుస్థాయి థియేటర్లలో

రికార్డుస్థాయి థియేటర్లలో

పఠాన్ సినిమాకు భారీ క్రేజ్ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేశారు. ఇండియాలో 2500 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా 5500 థియేటర్లలో రిలీజ్ చేయడం ఓ రికార్డుగా మారింది. ఓవర్సీస్‌లో కూడా షారుక్ ఖాన్ కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ చేశారు.

ఓవర్సీస్‌లో కలెక్షన్ల కుంభవృష్టి

ఓవర్సీస్‌లో కలెక్షన్ల కుంభవృష్టి

పఠాన్ సినిమాకు ఓవర్సీస్‌లో భారీ వసూళ్లు సాధించింది. యూకే, కెనడా, యూఎస్, జర్మనీ, ఫ్రాన్స్, దుబాయ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో భారీ వసూళ్లు సాధిస్తన్నది. ఓవర్సీస్‌లో తొలి రోజు 4.5 మిలియన్ డాలర్లు అంటే.. 37 కోట్లు రాబట్టింది. రెండో రోజున దాదాపు 25 కోట్ల మేర రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. దాంతో ఈ సినిమా 50 కోట్లకుపైగా ఓవర్సీస్ కలెక్షన్లు సాధించింది.

 తొలి రోజే 100 కోట్లు కలెక్షన్లు

తొలి రోజే 100 కోట్లు కలెక్షన్లు

పఠాన్ చిత్రం తొలి రోజున హిందీ సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించింది. హిందీ సినిమా రంగంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తొలి రోజే ఇండియాలో 57 కోట్లు రాబట్టి..ట్రేడ్ వర్గాల అంచనాలు మించింది. దాంతో ఇండియాలో బాలీవుడ్ సినిమాల పరంగా చరిత్రను లిఖించింది. ప్రపంచవ్యాప్తంగా 106 కోట్లు తొలి రోజే రాబట్టి.. తన స్టామినా ఏంటో తెలియజెప్పింది.

రెండో రోజు కలెక్షన్ల సునామీ

రెండో రోజు కలెక్షన్ల సునామీ

ఇక తొలి రోజు కొనసాగించిన కలెక్షన్ల ప్రభంజనమే రెండో రోజు సాగింది. విడుదలైన ప్రతి చోట పఠాన్ కలెక్షన్ల వసూళ్ల ప్రవాహం కొనసాగింది. రెండో రోజున ఇండియాలో 55 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా సుమారు 80 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దాంతో రానున్న రోజుల్లో భారీగా రికార్డుస్థాయి వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

 మొత్తం రెండు రోజుల్లో 235 కోట్లు

మొత్తం రెండు రోజుల్లో 235 కోట్లు

పఠాన్ బాక్సాఫీస్ జైత్రయాత్ర ఎక్కడ వరకు సాగుతుందో ట్రేడ్ వర్గాలకు అంతుచిక్కడం లేదు. పఠాన్ చిత్రం ఇప్పటికే అంటే రెండు రోజుల్లో 235 కోట్లు వసూలు చేయడం సినీ పరిశ్రమలో షారుక్ స్టామినాను తెలియజెప్పింది. ఇండియాలోనే కాకుండా ఆస్ట్రేలియా, అమెరికా, ఇండియా బాక్సాఫీస్ వద్ద నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X