Pathaan Day 5 Collections 300 కోట్ల క్లబ్‌లో పఠాన్.. బాహుబలి2, కేజీఎఫ్2 రికార్డులు బ్రేక్

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, దీపిక పదుకోన్ నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపిస్తున్నది. గత ఐదు రోజుల్లో కలెక్షన్ల సునామీతో దూసుకెళ్తున్నది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లనే కాకుండా సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం బాహుబలి రికార్డును కూడా బ్రేక్ చేసింది. గత ఐదు రోజుల్లో పఠాన్ సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

పఠాన్ హిందీ 4 రోజుల కలెక్షన్లు

పఠాన్ హిందీ 4 రోజుల కలెక్షన్లు

పఠాన్ సినిమా 5 రోజుల హిందీ వెర్షన్ ఇండియా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 57 కోట్లు, రెండో రోజు 70 కోట్లకుపైగా, మూడో రోజు 40 కోట్లు, నాలుగో రోజు 54 కోట్లు వసూలు చేసింది. గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం సుమారుగా 210 కోట్లపైగానే వసూళ్లను సాధించింది. ఇటీవల కాలంల ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన తొలి సినిమాగా పఠాన్ రికార్డులకెక్కింది.

పఠాన్ తెలుగు, తమిళం కలెక్షన్లు

పఠాన్ తెలుగు, తమిళం కలెక్షన్లు

ఇక తెలుగు, తమిళ వెర్షన్ విషయానికి వస్తే.. తెలుగులో తొలి రోజు ఇండియావైడ్ 1.5 కోట్లు, రెండో రోజు 1.75 కోట్లు, మూడో రోజు 85 లక్షలు, నాలుగో రోజు 1.25 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం నాలుగు రోజుల్లో 5.5 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇక తమిళంలో తొలి రోజు 50 లక్షలు, రెండో రోజు 75 లక్షలు, మూడో రోజు 40 లక్షలు, నాలుగో రోజు 50 లక్షలు వసూలు చేసింది.

కేజీఎఫ్2, బాహుబలి 2 రికార్డులు బ్రేక్

కేజీఎఫ్2, బాహుబలి 2 రికార్డులు బ్రేక్

పఠాన్ చిత్రం గత నాలుగు రోజుల్లో బాహుబలి, కేజీఎఫ్, దంగల్, సంజూ, టైగర్ జిందాహై చిత్రాల రికార్డులను అధిగమించింది. 250 కోట్ల రూపాయల క్లబ్‌లో 7 రోజుల్లో కేజీఎఫ్2 చేరితే.. బాహుబలి2 ఎనిమిది రోజుల్లో, దంగల్ 10వ రోజు, టైగర్ జిందా హై పదో రోజు చేరాయి. అయితే పఠాన్ చిత్రం కేవలం 5 రోజుల్లోనే 250 కోట్లు ఇండియావైడ్‌గా సాధించడం రికార్డుగా పేర్కొన్నవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

5వ రోజు ఆక్యుపెన్సీ

5వ రోజు ఆక్యుపెన్సీ


ఇక పఠాన్ 5వ రోజున హౌస్ ఫుల్స్‌తో థియేట్రికల్ రన్‌ను కొనసాగించింది. ముంబైలో 54 శాతం, ఢిల్లీలో 55 శాతం, పూణేలో 43 శాతం, బెంగళూరులో 68 శాతం, హైదరాబాద్‌లో 58 శాతం, కోల్ కతాలో 68 శాతం, చెన్నైలో 72 శాతం, సూరత్‌లో 40 శాతం, జైపూర్‌లో 58 శాతం, భోపాల్, లక్నోలో 45 శాతం ఆక్యుపెన్సీని కొనసాగించింది.

250 కోట్ల క్లబ్‌లోకి పఠాన్

250 కోట్ల క్లబ్‌లోకి పఠాన్

గత నాలుగు రోజుల్లో 210 కోట్లకుపైగా వసూలు చేసిన పఠాన్ చిత్రం ఆదివారం రోజున కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఇండియాలో ఆన్ లైన్ ద్వారా 54 కోట్లు, ఆఫ్ లైన్ ద్వారా 20 కోట్ల వసూళ్లను అంటే.. దాదాపు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 280 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించింది. కేవలం 5 రోజుల్లో 250 కోట్ల క్లబ్‌లో చేరింది.

ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు చేరువగా..

ప్రపంచవ్యాప్తంగా 450 కోట్లకు చేరువగా..

ఇక పఠాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత ఐదు రోజుల్లో ఇండియాలో 281 గ్రాస్, 264 కోట్ల షేర్ వసూళ్లతో రికార్డులను కొల్లగొట్టింది. ఇక ఓవర్సీస్‌లో గత 5 రోజుల్లో 165 కోట్లు వసూలు చేసింది. అమెరికా, యూకే, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 430 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది.

6 వ రోజు 300 క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు

6 వ రోజు 300 క్లబ్‌లోకి.. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు

పఠాన్ చిత్రం 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. విడుదలైన ప్రతీ చోట, ప్రపంచవ్యాప్తంగా స్ట్రాంగ్‌గా కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ చిత్రం ఇండియాలో 6వ రోజు 25 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 35 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ దాంతో ఈ చిత్రం 6వ రోజున ఇండియావైడ్ 300 కోట్ల క్లబ్‌లో, ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల వసూళ్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X