Pathaan Day 6 Collections 600 కోట్లతో పఠాన్ బాక్సాఫీస్ సునామీ.. 1000 కోట్ల లక్ష్యంగా షారుక్ ఖాన్!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీగా మారింది. గతవారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వసూళ్లు కుంభవృష్టిని కురిపిస్తున్నది. యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ భాషలోను భారీగా కలెక్షన్లను రాబడుతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో, కీలక పాత్రలో దీపిక పదుకోన్, జాన్ అబ్రహం నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

6వ రోజు హిందీ ఆక్యుపెన్సీ

6వ రోజు హిందీ ఆక్యుపెన్సీ

పఠాన్ చిత్రానికి సంబంధించి 6వ రోజు హిందీ ప్రాంతాల్లో ఆన్ లైన్ ఆక్యుపెన్సీ వివరాల్లోకి వెళితే.. ముంబైలో 20 శాతం, ఢిల్లీలో 20 శాతం పూణేలో 17 శాతం, బెంగళూరులో 35 శాతం, హైదరాబాద్‌లో 31 శాతం, ఆహ్మాదాబాద్‌లో 11 శాతం, చెన్నైలో 24 శాతం, సూరత్‌లో 11 శాతం, జైపూర్‌లో 20 శాతం, చండీగఢ్‌లో 13 శాతం, భోపాల్ 27 శాతం, లక్నోలో 17 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. ఉత్తరాదిలో గత నాలుగు రోజులతో పోల్చుకొంటే కాస్త కలెన్లు క్షీణించాయి.

తెలుగు, తమిళ భాషల్లో 6వ రోజు ఆక్యుపెన్సీ

తెలుగు, తమిళ భాషల్లో 6వ రోజు ఆక్యుపెన్సీ

పఠాన్ చిత్రం తెలుగు వెర్షన్ ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో 35 శాతం, బెంగళూరులో98 శాతం, విజయవాడలో 34 శాతం, వరంగల్‌లో 50 శాతం, గుంటూరులో 10 శాతం, వైజాగ్‌లో 38 శాతం, నిజమాబాద్‌లో 7 శాతం, కాకినాడలో 11 శాతం, నెల్లూరులో 7 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. ఉత్తరాది కంటే తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా ఈ సినిమా వసూళ్లను సాధిస్తున్నది. తమిళ వెర్షన విషయానికి వస్తే.. పాండిచ్చేరిలో 40 శాతం తప్పా.. మిగితా ప్రాంతాల్లో 20 శాతానికి మించి ఆక్యుపెన్సీని సాధించలేదు.

గత ఐదు రోజుల్లో దక్షిణాదిలో

గత ఐదు రోజుల్లో దక్షిణాదిలో

పఠాన్ చిత్రం గత ఐదు రోజుల్లో తెలుగు తమిళ భాషల్లో 10.50 కోట్లు రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.5 కోట్లు, రెండో రోజున 1.75 కోట్లఉ, మూడో రోజున 85 లక్షలు, నాలుగో రోజున 1.25 కోట్లు, ఐదో రోజున 1.5 కోట్లు వసూలు చేసింది. ఇక తమిళంలో తొలి రోజున 50 లక్షలు, రెండో రోజున 75 లక్షలు, మూడో రోజున 40 లక్షలు, నాలుగో రోజున 50 లక్షలు, ఐదో రోజున 75 లక్షలు వసూలు చేసింది.

పఠాన్ హిందీ వెర్షన్ కలెక్షన్లు

పఠాన్ హిందీ వెర్షన్ కలెక్షన్లు

పఠాన్ హిందీ వెర్షన్ వివరాల్లోకి వెళితే.. తొలి రోజున 55 కోట్లు, రెండో రోజున 68 కోట్లు, మూడో రోజున 38 కోట్లు, నాలుగో రోజున 51.5 కోట్లు, ఆదివారం 59 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 275 కోట్ల మేర వసూళ్లు సాధించింది. కేవలం రోజుల్లోనే ఈ చిత్రం 300 కోట్ల వసూళ్లకు చేరువైంది.

ప్రపంచవ్యాప్తంగా గత 5 రోజుల్లో

ప్రపంచవ్యాప్తంగా గత 5 రోజుల్లో


ఇక ప్రపంచవ్యాప్తంగా పఠాన్ చిత్రం వసూళ్ల వీరవిహారం చేస్తున్నది. గత ఐదు రోజుల్లో ఇండియాలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో కలిపి 335 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 207 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 542 కోట్లు రాబట్టింది. ప్రపంచబాక్సాఫీస్ వద్ద అరుదైన ఫీట్ సాధించిన ఇండియన్ చిత్రంగా రికార్డును తిరగ రాసింది.

పఠాన్ చిత్రం 6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు

పఠాన్ చిత్రం 6వ రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్లు


ఇక పఠాన్ చిత్రం 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత ఐదురోజుల్లో హిందీ 275 కోట్లు, తెలుగు, తమిళంలో 10 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 542 కోట్లు రాబట్టిన ఈ చిత్రం 6వ రోజున కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. హిందీలో ఈ చిత్రం 23 కోట్లు రాబట్టగా, తెలుగు, తమిళ, ఇతర భాషల్లో డబ్బింగ్ 6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక ఓవర్సీస్‌లో 20 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం హిందీ వెర్షన్ 300 కోట్ల మైలురాయిని దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 6వ రోజున సుమారు 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 592 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X