Pathaan Day 7 Collections చరిత్ర సృష్టించిన పఠాన్ చిత్రం.. ఇండియాలో టాప్ 9 మూవీగా.. 700 కోట్లకు చేరువగా!

బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపిక పదుకోన్, జాన్ అబ్రహం నటించిన పఠాన్ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద గత ఏడు రోజులుగా హల్‌చల్ చేస్తున్నది. యష్ రాజ్ ఫిలింస్ రూపొందించిన ఈ చిత్రం ట్రేడ్ అనలిస్టులు, పండితుల అంచనాలను మంచి కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రం విడుదలైన అన్ని దేశాల్లో రికార్డు కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ సినిమా 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

260 కోట్ల బడ్జెట్‌తో

260 కోట్ల బడ్జెట్‌తో

ఇంటర్నేషనల్ స్పై థ్రిల్లర్‌గా, యాక్షన్ దట్టించిన పఠాన్ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. నటీనటుల పారితోషికం, ఇతర ఖర్చులతోసహా ఈ సినిమాను 260 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇటీవల కాలంలో షారుక్ ఖాన్ నటించిన సినిమాకు ఇదే అత్యధిక బడ్జెట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం షారుక్ ఖాన్‌కు తొమ్మిదేళ్ల తర్వాత విజయాన్ని అందించింది.

8000 స్క్రీన్లలో రిలీజ్

8000 స్క్రీన్లలో రిలీజ్

పఠాన్ సినిమా టీజర్లు, ట్రైలర్లు, వివాదాస్పద అంశాలు క్రేజ్ పెంచాయి. నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ సినిమా రావడం, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూడటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దాంతో ఈ సినిమాను ఇండియాలో 5500 స్క్రీన్లలో, ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇటీవల కాలంలో అత్యధిక స్క్రీన్లలో రిలీజైన ఇండియన్ సినిమా పఠాన్ కావడం విశేషంగా మారింది.

అమెరికాలో హలీవుడ్ సినిమాలను మించి

అమెరికాలో హలీవుడ్ సినిమాలను మించి


పఠాన్ చిత్రం ఓవర్సీస్‌లో రికార్డు వసూళ్లను రాబడుతున్నది. గత 6 రోజుల్లో ఈ చిత్రం వివిధ దేశాల్లో సుమారు 17.5 మిలియన్ డాలర్లు అంటే.. 225 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. యూఎస్, కెనడాలో కలిపి ఈ చిత్రం 10 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. అమెరికాలో హాలీవుడ్ సినిమాలు బాన్షీష్, టార్, టాస్, ఉమెన్ టాకింగ్ సినిమాలకు మించి కలెక్షన్లు వసూలు చేయడం రికార్డుగా మారింది.

ఇండియాలో స్ట్రాంగ్‌ కలెక్షన్లు

ఇండియాలో స్ట్రాంగ్‌ కలెక్షన్లు

పఠాన్ చిత్రం ఇండియాలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజై ఘనంగా వసూళ్లను సాధిస్తున్నది. తెలుగు, తమిళంలో దాదాపు 11 కోట్లు రాబట్టింది. ఇక హిందీ వెర్షన్‌తో కలుపుకొని ఈ చిత్రం ఇప్పటి వరకు 330 కోట్లు ఇండియా వైడ్‌గా వసూలు చేసింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా నిలిచింది.

గత 6 రోజుల్లో ఎంతంటే?

గత 6 రోజుల్లో ఎంతంటే?


పఠాన్ సినిమా అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, యూఏఈ దేశాల్లో భారీగా రిలీజైంది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం 635 కోట్ల రూపాయాలు గత ఆరు రోజుల్లో సాధించింది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన 9వ చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

పఠాన్ 7వ రోజు కలెక్షన్లు ఇలా..

పఠాన్ 7వ రోజు కలెక్షన్లు ఇలా..


ఇక పఠాన్ చిత్రం 7వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 7వ రోజు హిందీ, తెలుగు, తమిళ వెర్షన్లలో నిలకడగా వసూళ్లు రాబట్టింది. హిందీ వెర్షన్ 20.5 కోట్లు, తెలుగు 60 లక్షలు, తమిళంలో 35 లక్షలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలో 22 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఓవర్సీస్‌తో కలుపుకొని ఈ చిత్రం 7వ రోజున 25 కోట్ల మేర వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 660 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X