Pathaan 10 Days Collections: పఠాన్ ఊచకోత.. ఇండియాలోనే టాప్ మూవీగా రికార్డు.. RRRకు బిగ్ షాక్

తనదైన నటన, విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకులకు అలరిస్తూ.. ఇండియన్ సినిమాలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న స్టార్ బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగానే జాతీయ స్థాయిలో హవాను చూపిస్తోన్న ఆయన.. కొన్నేళ్ల పాటు సినిమాలు చేయడం ఆపేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే షారూఖ్ 'పఠాన్' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో 'పఠాన్' మూవీ పది రోజుల కలెక్షన్ల రిపోర్టును మీరు కూడా చూసేయండి మరి!

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్

పఠాన్‌గా షారూఖ్ ఖాన్ ఎంటర్

సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన తాజా సినిమానే 'పఠాన్'. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దీపికా పదేకొణె హీరోయిన్‌గా చేసింది. ఇందులో జాన్ అబ్రహం కీలక పాత్రను చేశాడు. కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిన్న పాత్ర చేశాడు. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మించారు. విశాల్ శేఖర్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

పఠాన్ సినిమా బిజినెస్.. రిలీజ్

బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీ హక్కులకు ఓ రేంజ్‌లో డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ యాక్షన్ మూవీకి దాదాపు రూ. 250 - 260 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అందుకు అనుగుణంగానే దీన్ని దాదాపు 8000లకు పైగా థియేటర్లలో దీన్ని గ్రాండ్‌గా తీసుకొచ్చారు.

తొమ్మిది రోజుల్లో ఎంతొచ్చింది?

తొమ్మిది రోజుల్లో ఎంతొచ్చింది?


సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సీనియర్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' మూవీకి ఆరంభంలోనే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో మంచి టాక్ లభించింది. దీనికితోడు రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వచ్చాయి. దీంతో ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. ఇలా తొమ్మిది రోజుల్లో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 351 కోట్లు నెట్‌, రూ. 696 కోట్లు గ్రాస్ వసూలైంది.

పదో రోజు ఎంత వసూలైంది?

పదో రోజు ఎంత వసూలైంది?

షారూఖ్ ఖాన్ - దీపికా పదుకొనె జంటగా నటించిన 'పఠాన్' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దీన్ని పాన్ ఇండియా రేంజ్‌లో చాలా భాషల్లో విడుదల చేశారు. అందుకు అనుగుణంగానే దీనికి అన్ని ఏరియాల్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇలా 10వ రోజు ఈ చిత్రానికి ఓవరాల్‌గా రూ. 28 - 30 కోట్లు గ్రాస్, రూ. 12 - 16 కోట్లు నెట్ వచ్చినట్లు తెలిసింది.

పది రోజులకు కలిపి ఎంతంటే

పది రోజులకు కలిపి ఎంతంటే

పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'పఠాన్' మూవీకి హిందీలో మాత్రం భారీ వసూళ్లు వస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. 10 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 381 కోట్లు వరకూ నెట్ వసూలు అయింది. అలాగే, రూ. 726 - 730 కోట్లు వరకూ గ్రాస్ కలెక్ట్ చేసింది. తద్వారా ఈ క్రేజీ మూవీ ఇప్పటికే ఎన్నో రికార్డులను సైతం బ్రేక్ చేసేసింది.

ఓవర్సీస్‌లో RRR రికార్డు బ్రేక్

ఓవర్సీస్‌లో RRR రికార్డు బ్రేక్

సీనియర్ హీరో షారూఖ్ ఖాన్‌ను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకు అనుగుణంగానే 'పఠాన్' చిత్రాన్ని చాలా దేశాల్లో గ్రాండ్‌గా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ 10 రోజుల్లో ఓవర్సీస్‌లో 34.5 మిలియన్స్ వరకూ రాబట్టి సంచలనం సృష్టించింది. తద్వారా ఫుల్ రన్‌లో RRR వసూలు చేసిన 34 మిలియన్ డాలర్ల రికార్డు బ్రేక్ చేసి సత్తాను చాటుకుంది.

టాప్ మూవీగా.. మరో రికార్డుకు

టాప్ మూవీగా.. మరో రికార్డుకు

'పఠాన్' మూవీ పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 381 కోట్ల వరకూ నెట్ వసూలు చేసింది. అందులో హిందీలోనే రూ. 367 కోట్ల వరకూ వచ్చింది. తద్వారా బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల జాబితాలో 'దంగల్' రూ. 374 కోట్లు నెట్ రికార్డుకు చేరువైంది. అలాగే, ఇప్పటికే వేగంగా రూ. 700 కోట్లు గ్రాస్ సాధించిన ఏకైక ఇండియన్ మూవీగా ఇది రికార్డు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X